అలనాటి స్టార్ హీరో ఏఎన్ఆర్ నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున తనదైన స్టైల్ లో సినిమాలను నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న నాగార్జున ఇటివల వరుసగా డిజాస్టర్ సినిమాలను చవి చూశాడు. ప్రస్తుతం నాగార్జున సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తున్నాడు. అతడి కొత్త సినిమా రైటర్ బెజవాడ ప్రసన్న డైరెక్షన్‌లో రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.
ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
త్వరలోనే బిగ్ బాస్ 7 బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా ఉండబోతుందట. సోషల్ మీడియాలో కూడా నాగార్జునకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నాగార్జున టాలీవుడ్ లో అన్నా అని ఆప్యాయంగా పిలిచే ఓ స్టార్ హీరో ఉన్నాడట.
ఆయనంటే నాకు ఎంతో అభిమానం అంటూ నాగార్జున స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన ఎవరో కాదు నందమూరి హరికృష్ణ.. నాగార్జున తన సొంత అన్న వెంకట్‌ను కూడా ఒరేయ్ అంటూ పిలిస్తే ఒక్క హరికృష్ణను మాత్రమే అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తాడట. వీరిద్దరి మధ్య చాలా మంచి బంధం ఉందట హరికృష్ణ – నాగార్జున కలిసి నటించిన సీతారామరాజు సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్యన బంధం బాగా బలపడిందట.
ఆ తర్వాత ఎప్పుడు కలిసిన హరికృష్ణను నాగార్జున అన్నా అని ఆప్యాయంగా పిలిచే వాడినని నాగార్జున వివరించాడు. జూనియర్ ఎన్టీఆర్.. నాగార్జునకి కూడా మంచి అనుబంధ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా రావాల్సి ఉండగా ఏవో కారణాల చేత ఆగిపోయింది. నాగార్జున సక్సెస్ రేట్ ఇటీవల కాలంలో తగ్గింది. నాగ్ ఇప్పుడు హిట్లు కొట్టకపోతే కెరీర్ పరంగా మరింత వెనకపడిపోవడం ఖాయం.