మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె విడాకుల తర్వాత ఏ చిన్న విషయం జరిగిన నెగిటివ్గా ట్రోల్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. తాజాగా నిహారికపై మరో విషయంలో ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ తో ఫైర్ అవుతున్నారు కొంతమంది నెటిజన్స్. మొదట హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది నిహారిక. సినిమాలో అంతగా సక్సెస్ రాక దర్శక, నిర్మాతలు కూడా అవకాశం ఇవ్వడం మానేశారు.
దీంతో హీరోయిన్గా ఆమె సెట్ అవ్వదు అని తెలుసుకున్న నిహారిక తండ్రి నాగ బాబు సపోర్ట్ తో ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకుంది. ఆ తర్వాత జొన్నలు గడ్డ చైతన్యని పెళ్లి చేసుకున్న నిహారిక ప్రవర్తనలో చాలా వరకు మార్పు వచ్చింది. ముఖ్యంగా తన వేషధారణ అప్పటివరకు ట్రెడిషనల్ లుక్ లో మాత్రమే కనిపించిన నిహారిక తరువాత అత్తింటి, పుట్టింటి వారి పరువు తీసే విధంగా పొట్టి బట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది.
పెళ్లైన కొన్ని నెలల నుంచి భర్తతో గొడవలు మొదలవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారణం ఏంటో తెలియదు గానీ ఆమె ప్రవర్తన, ఫ్రీడమ్‌ని ఓవర్‌గా వాడుకోవడమే దీనికి కారణం అని ప్రచారం జరిగింది. నిజానికి పెళ్లి తర్వాత నిహారికల్లో కూడా చాలా మార్పు వచ్చంది. రీసెంట్గా విడాకులు తీసుకున్న నిహారిక ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో ఆమె కాస్త పద్ధతిగా చీర కట్టుకుని, గాజులు, బొట్టు పెట్టుకొని కనిపించింది. చాలామందికి ఆ ఫోటోస్ నచ్చాయి. కాగా కొంతమంది మాత్రం ఆమెపై నెగటివ్ ట్రోల్స్ చేస్తూ కామెంట్ చేశారు. పొట్టి పొట్టి బట్టలతో మెగా ఫ్యామిలీ పరువు తీయడమే కాక మంచి( చైతన్య ) ఫ్యామిలీని కూడా మిస్ చేసుకున్నావ్ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇలాగే పద్ధతిగా తయారై ఉండుంటే విడాకులు కూడా అయ్యేవి కాదు. ఇదేదో విడాకుల ముందు ఉండాలమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.