కొడుకుల ఫ్యూచ‌ర్ కోసం కెరీర్‌లో ఫ‌స్ట్ టైం ఆ ప‌ని చేస్తోన్న నాగార్జున… ఇండ‌స్ట్రీయే షాక్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు ..అలాంటి ఓ చెరగని స్దాయిని ముద్రించారు. అంతేకాదు ఆ తరువాత ఆ పేరుని కొనసాగిస్తూ అక్కినేని నాగార్జున కూడా అక్కినేని ఇంటి పరువును టాప్ పొజిషన్లో పెట్టారు . తాత , తండ్రి ..అక్కినేని ఇంటి పేరుని నిలబెట్టినంత గొప్పగా ఆ తర్వాతి తరం నాగార్జున కొడుకులు అఖిల్ – నాగచైతన్య నిలబెట్టలేకపోయారు.

Custody Trailer (Telugu) | Naga Chaitanya | Krithi Shetty | Yuvan Shankar  Raja | Venkat Prabhu - YouTube

ఈ ఇద్దరు హీరోలు. ఇప్పటివరకు సరైన హిట్‌ కొట్టిందే లేదు. ఇంతవరకు రు. 100 కోట్ల క్లబ్ లోకి చేరింది లేదు. అస‌లు వీళ్ల‌కు ఒక్క హిట్ వ‌స్తేనే గొప్ప అన్నంత స్థాయికి దిగ‌జారిపోయారు. అఖిల్ , నాగచైతన్య ..వయసుగల మిగతా హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తూ మంచినీళ్లు తాగినంత సులువుగా రు. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంటే ..ఇంకా వీళ్ళు సరైన హిట్ కొట్టడానికి ఆప‌సోపాలు ప‌డుతూనే ఉన్నారు.

Nagarjuna And Sonal Chauhan's The Ghost Will Be Streamed On The OTT  Platform From This Date

గ‌త సంవ‌త్స‌ర కాలం నుంచి అక్కినేని ఫ్యామిలీకి ఆస‌లు క‌లిసి రావ‌డం లేదు ఎలాంటి సినిమాలు చేసినా అవి డిజాస్టార్లుగా మిగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే నాగార్జున మొదటిసారిగా తన జీవితంలో ఎప్పుడు చేయని పని చేయబోతున్నాడని తెలుస్తుంది. తన కొడుకుల భవిష్యత్తు కోసం నాగార్జున ఆశలు నమ్మని పూజలు, హోమాలు చేయబోతున్నాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ పండితులను తీసుకొచ్చి నాగార్జున తన కొడుకులతో ఈ హోమాలు చేయించబోతున్నాడట.

Agent OTT Streaming : ప్రముఖ ఓటీటీలో ఏజెంట్.. రేపటి నుంచి స్ట్రీమింగ్..  Akhil akkineni Agent to stream on sony liv from tomorrow here are the  details– News18 Telugu

అఖిల్- నాగచైతన్య చేయబోయే తర్వాత సినిమాలైనా మంచి విజయం సాధించాలని అక్కినేని ఫ్యామిలీ బాగుండాలని ఈ పూజలను భారీ ఖ‌ర్చుతో చేస్తున్నట్లు తెలుస్తుంది. పూజలను పెద్దగా పట్టించుకోని నాగార్జున కొడుకుల కోసం ఇలాంటి పనిచేస్తుండడంతో ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక్క‌సారిగి షాక్ అయిపోతున్నారు. ఈ విధంగా అయినా అక్కినేని హీరోల భవిష్యత్ మారుతుందో లేదో చూడాలి.