Ye Maya Chesave 2 : నాగ చైతన్య, సమంతలని కలపబోతున్న దర్శకుడు..!

Ye Maya Chesave 2 : నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమా ఇద్దరి కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. సమంత ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఏ మాయ చేసావే సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటాయి. ఆ సినిమాని గౌతం మీనన్ డైరెక్ట్ చేశారు. అయితే రీసెంట్ గా శింబుతో ఓ సినిమా చేసిన గౌతం మీనన్ తను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏం చేయాలని ఉందో చెప్పమంటే ఏమాయ చేసావె 2, ఘర్షణ 2, రాఘవన్ 2 చేయాలని ఉందని అన్నారు.

అయితే ఘర్షణ, రాఘవన్ సినిమాలు చేయడానికి వెంకటేష్, కమల్ హాసన్ లు ఇద్దరు రెడీగా ఉన్నారు. అయితే ఏమాయ చేసావె 2 చేయాలంటే మాత్రం నాగ చైతన్య, సమంత కావాల్సి ఉంటుంది. ఏ మాయ చేసావే సినిమాతో ఏర్పడిన బంధం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకునేలా చేసింది. అయితే వీరి వివాహ బంధం ఎన్నాళ్లో నిలవలేదు. 3 ఏల్లకే వీరు ఎవరి దారి వారు చూసుకున్నారు.

మరి ఈ టైం లో ఏ మాయ చేసావే 2 (Ye Maya Chesave 2 ) గౌతం చేస్తానని చెప్పినా సరే నాగ చైతన్య, సమంత చేసేందుకు ఒప్పుకోరని చెప్పొచ్చు. మరి గౌతం మీనన్ వీరిద్దరిని ఒప్పిస్తాడా లేక వేరే హీరో హీరోయిన్ ని చూసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.

 

Tags: E Maya Chesave 2, Naga Chaitanya, Samantha, Tollywood