Sree Leela :వామ్మో.. ఆ హీరోయిన్ హోటల్ బిల్లుకే 10 లక్షలట..!

Sree Leela : కన్నడ భామ శ్రీలీలకి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా పెళ్లిసందడి. ఆ సినిమాలో శ్రీలీల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హీరోయిన్ లోని ఈజ్ చూసి వరుస ఛాన్సులు ఇచ్చారు. ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమాలో నటిస్తున్న శ్రీలీల. మరోపక్క వైష్ణవ్ తేజ్ చేస్తున్న ఒక సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

త్రివిక్రం వైఫ్ సౌజన్యా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం శ్రీలీల హోటల్ ఖర్చుకే 10 లక్షల దాకా పెట్టేస్తున్నారట. సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన Sree Leela 25 రోజుల దాకా ఇక్కడ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెకి స్టేయింగ్ గా ఓ పెద్ద స్టార్ హోటల్ లో రూం ని ఏర్పాటు చేశారట. అయితే రోజుకి ఆమె కోసం 22 వేల దాకా ఖర్చు చేస్తున్నారట. శ్రీలీలతో పాటుగా తన మదర్ కూడా అక్కడే ఉంటున్నారట.

రోజుకి 22 లక్షలు అంటే ఈ షెడ్యూల్ లో దాదాపు 25 రోజుల దాకా షూటింగ్ ఉందట. అంటే ఇప్పుడొక 6 లక్షలు.. మళ్లీ సెకండ్ షెడ్యూల్ కోసం మరో 20 రోజుల దాకా షెడ్యూల్ ఉంటుందట. అప్పుడు ఒక 4, 5 లక్షలు. మొత్తం హీరోయిన్ స్టేయింగ్ కోసమే 10 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారట నిర్మాతలు.

Tags: Heroine, Hotel, movie, Pellisandadi, Sree Leela, Vaishnav Tej