Vikram : కోబ్రా రిలీజ్ డేట్ మళ్లీ మారింది.. ఫాన్స్ కి నిరాశేనా..?

ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు కమల్ హాసన్. ఆ తర్వాత ఆయన స్థాయి నటుడిగా చియాన్ విక్రమ్ కి పేరుంది. కమల్ హాసన్ లాగే విక్రమ్ కూడా పలు చిత్రాల్లో వివిధ గెటప్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శివపుత్రుడు, అపరిచితుడు, శేషు(తమిళ్), ఐ, మల్లన్న, మహాన్ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలో విక్రమ్(Vikram) నటించాడు.ఇప్పుడు మరోసారి విక్రమ్ కోబ్రా సినిమా ద్వారా నటనలో తన సత్తా చుపించబోతున్నాడు.

ఇంతకుముందు అపరిచితుడు సినిమాలో 3 గెటప్ లలో కనిపించిన విక్రమ్(Vikram) ఇప్పుడు కోబ్రా సినిమాలో ఏకంగా 25 గెటప్ లలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. కాగా కోబ్రా సినిమాకు అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఒక ముఖ్య పాత్రలో టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నాడు.7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించారు.

కాగా ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల కిందటే పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడింది. కొద్ది రోజుల కిందట ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇవాళ ప్రకటించింది. ఆగస్టు 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. కాగా విక్రమ్ ఈ సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానుంది.

Tags: movie news, tollywood gossis, tollywood news, vikram