ఏమో..నేను మళ్లీ ప్రేమలో పడతానేమో.. చైతూ సెన్సేషనల్ కామెంట్స్..!

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరి గురించి వార్తలు రోజు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. విడాకుల తర్వాత సమంత గురించి నాగచైతన్య చాలా తక్కువ సందర్భాల్లో స్పందించినప్పటికీ.. సమంత మాత్రం అవకాశం వచ్చిన్నప్పుడల్లా విడాకుల గురించి ప్రస్తావన తెస్తోంది. పరోక్షంగా చైతన్య పై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో కూడా విడాకుల గురించి సమంత మాట్లాడింది.

కాగా ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చద్దా అనే హిందీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా చైతూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చైతూ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ప్రెస్ మీట్ లకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు సమంతకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావన ఎదురవుతోంది. తాజాగా ఓ విలేకరి మళ్లీ మీరు ప్రేమలో పడ్డారా.. లేదా ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించాడు. దీనికి నాగచైతన్య ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు.

ఏమో ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు. మళ్లీ ప్రేమలో పడతానేమో.. అని రిప్లై ఇచ్చాడు. ‘ ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం జీవించడానికి గాలి ఎంత కీలక పాత్ర పోషిస్తోందో.. మన జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ప్రేమించడం తో పాటు ప్రేమను స్వీకరించాలి. అప్పుడే జీవితం ఆరోగ్యంగా సానుకూలంగా సాగుతుంది.’ అంటూ ప్రేమ గురించి తన అభిప్రాయాలను చెప్పాడు చైతన్య.

Tags: Naga Chaitanya, naga chaitanya shobhitha dhulipala, Samantha, tollywood news