స్టార్ హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

కొన్నేళ్లుగా లవ్ లో ఉన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లైన రెండు నెలలకే అలియాభట్ తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. అయితే తల్లి అవ్వడానికి అంత తొందర ఎందుకు అంటూ పలువురు ఆమెపై ట్రోలింగ్ చేశారు. దీనిపై ఆమె గట్టిగానే సమాధానం చెప్పారు. తన వ్యక్తిగత జీవితం గురించి జోక్యం చేసుకోవద్దు..అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

కాగా అలియా భట్ గర్భిణీ అయినప్పటికీ తన సినిమాల షూటింగ్స్, ప్రమోషన్స్ మాత్రం నిర్వహిస్తోంది.తన భర్త రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో కూడా అలియా భట్ పాల్గొంటోంది. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా చేపడుతున్నారు. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలోని ఒక సాంగ్ ప్రివ్యూ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి అలియాభట్ భర్తతో కలిసి హాజరయ్యింది.

అయితే ఇందులో అలియాభట్ బేబీ పంప్ తోటే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలియా భట్ గర్భిణి అయిన తర్వాత బేబీ పంప్ ఫోటోలు బయటకు రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు జీలే జరా, ఇన్ షాల్లా, ఆషికీ 3, తక్ట్,రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Tags: Alia Bhatt, alia bhatt babu bump, ranbeer kapoor