భ‌ర్తలు చ‌నిపోయినా మ‌ళ్లీ పెళ్లీ చేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే…!

సినిమారంగం ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎవరితో ? ఎప్పటి వరకు కలిసి ఉంటారో ఎవరు ఎప్పుడు ? విడిపోతారో కూడా చెప్పలేం. ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు చాలా సింపుల్ గా జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తిని వదిలేసి మరో పెళ్లి చేసుకోవడం చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఇక ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకున్న హీరోలు.. హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ భర్త చనిపోయినా కానీ పెళ్లి చేసుకునే వయసు ఉండి కూడా వారి జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్న కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు.

Mersal-Viswasam star,Surekha Vani's husband passes away

సురేఖావాణి :
సినిమా ఇండస్ట్రీలో అక్క, వదిన, అమ్మ ఇలా ఎన్నో పాత్రల్లో నటించే సురేఖవాణి భర్త సురేష్ తేజ 2019లో చనిపోయారు. ఆమెకు ఇంకా చాలా వయసు ఉంది. పెళ్లి చేసుకుని మళ్లీ కొత్త జీవితం ప్రారంభించవచ్చు. అయినా కూడా ఆమె తన భర్త జ్ఞాపకాలను మదిలో ఉంచుకుని పెళ్లి చేసుకోకుండా కూతురుతో ఆనందంగా జీవిస్తుంది.

రాగిణి :
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోనూ, సీరియల్స్ లోను నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది రాగిణి. ఆమె కూడా వివాహం జరిగిన కొద్ది కాలానికే భర్తను కోల్పోయింది. అయినా కూడా రాగిణి పెళ్లి చేసుకోకుండా తన అక్క పిల్లలతో కాలక్షేపం గడుపుతుంది.

Uday Kiran Wife Vishita: ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి ఈ నిజాలు మీకు తెలుసా..? | Here the interesting facts about Tollywood late hero Uday Kiran Wife Vishita and what she is doing now
ఉదయ్ కిరణ్ :
టాలీవుడ్ లో 20 సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగాడు కుర్ర హీరో ఉదయ్ కిరణ్. 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ మరణం తర్వాత భార్య విషితకు పెళ్లి చేసుకునే వయసు ఉన్నా పెళ్లి ఊసు ఎత్తకుండా చెన్నైలో జాబ్ చేస్తూ భర్త జ్ఞాపకాల్లోనే జీవిస్తోంది.

రోహిణి :
మరో సీనియర్ యాక్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి కూడా ప్రముఖ విలన్ పాత్రలతో మెప్పించిన రఘువరన్ ను పెళ్లి చేసుకుంది. రఘువరన్ తో విడిపోయాక ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు రఘువరన్ మృతి చెందారు. అయినా ఆమె మరో పెళ్లి చేసుకోకుండా తన కుమారుడిని పెంచుకుంటూ అలాగే కాలం గడుపుతుంది.

Rohini Family Husband Biography Parents children's Marriage Photos
శ్రీహరి :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ స్టార్ శ్రీహరికి ఎంతో మంచి పేరు ఉంది. ఆయన భార్య ఒకప్పటి నటి డిస్కో శాంతి. తన భర్త చనిపోయిన ఇంకా ఆయన జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తోంది.

మీనా :
సీనియర్ హీరోయిన్ మీనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది. ఒక పాప పుట్టాక గత ఏడాది విద్యాసాగర్ ఆకస్మికంగా మృతి చెందారు. మీనా ఆ తర్వాత ఎవరెవరినో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా వాటన్నింటినీ కొట్టి పారేస్తూ ఆమె సినిమాల్లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.

Meena's husband Vidyasagar passes away - The Hindu

భానుప్రియ :
భానుప్రియ తన భర్త ఆదర్శ కౌశల్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆదర్శ చనిపోయినా ఆమె మరో పెళ్లి చేసుకోలేదు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ తన భర్త ముఖేష్ అగర్వాల్ చనిపోయిన మరో పెళ్లి చేసుకోలేదు. ఇక సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ క‌పూర్ చనిపోయినా పిల్లల భవిష్యత్తు కోసం అలాగే జీవిస్తోంది. సీనియర్ నటి కవిత భర్త దశరథ రాజ్, సుమలత భర్త అంబ‌రీష్ మృతి చెందినా వీళ్లు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల కోసమే జీవిస్తున్నారు.

Ex-Husband of star heroine passes away