సమంత విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన నాగ చైతన్య ..? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం..!

అక్కినేని నాగచైతన్య – సమంత వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. యేగాదిన్న‌ర క్రితం వీరిద్ద‌రు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న‌ సమయంలో ఎంతోమంది అభిమానులు చాలా బాధపడ్డారు. వారు ఎప్పటికైనా మళ్లీ కలిసిపోతార‌ని ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే వీరి విడాకులు తీసుకోవడానికి కారణం సమంతకు వేరే అబ్బాయితో ఎఫైర్ ఉందని, అక్కినేని ఫ్యామిలీయే కారణం అని, అలాగే నాగచైతన్యకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని. ఇలా ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి.

కానీ ఇందులో ఏవి నిజం కాదు. అంతే కాకుండా సమంత నాగచైతన్య పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడడం లేదు. ప్రస్తుతం వారిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. సమంత వరుస సినిమాలు షూటింగుల్లో బిజీగా బిజీగా ఉంది. అయితే సమంత.. నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం నాగచైతన్య సరియైన భర్త కాదన్న ఫీలింగ్ ఆమెకు రావ‌డ‌మే అని ఇప్పుడు సరికొత్త పుకారు లేచింది.

Samantha rebuys the same house she was living with ex-husband Naga Chaitanya  for a whopping amount | PINKVILLA

చైతు సమంతను మానసికంగా, శారీరకంగా చాలా వేధించేవాడ‌ట‌. తన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేసుకోమని హింసించాడ‌ని.. అందుకే సమంత.. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుందన్న ప్ర‌చారం ఇప్పుడు సోష‌ల్ మీడియా సైట్స్‌లో ఠారెత్తిపోతోంది. ఈ విష‌యాన్ని సమంతనే స్వయంగా త‌న‌కు చెప్పారంటూ ప్రముఖ సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు ఒక సెన్సేషనల్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.

అయితే ఇంతకుముందు ఆయన చాలామంది సినిమా సెల‌బ్రిటీల‌పై రూమర్స్ ను ట్విట్ చేశారు. ప్రభాస్ – కృతీ సనన్ పెళ్లి, పూజా హెగ్డే – సల్మాన్ ఖాన్ ను ప్రేమించారు అంటూ ఇలా ఎన్నో రకాల ఫేక్ న్యూస్‌లు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదు. కాబట్టి ఈ విషయం కూడా అబద్ధం కావచ్చని ఆయన మాటలు నమ్మశక్యంగా ఉండవని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, NagaChaitanya, Samantha, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood gossips, tollywood news