అచ్చెన్నాయుడిని చిత్తుగా ఓడిద్దాం.. జ‌గ‌న్ పేప‌ర్ లెక్క‌లు పిచ్చ కామెడీయే…!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో గెలుస్తారా ? ఆయనకు ఈసారి అక్కడ గట్టి పోటీ ఎదురుకానుందా ? తాజా సర్వేలు ఏం చెబుతున్నాయి అన్నదానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అచ్చెం న్నాయుడు గత రెండు ఎన్నికల్లోను టెక్కలి నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో రాష్ట్రం అంతటా టిడిపి చిత్తుగా ఓడిపోయినా టెక్కలిలో మాత్రం అచ్చెన్న వరుసగా రెండోసారి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రద్దయిన హరిచంద్రపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.

టెక్కలి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1994లో భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తర్వాత ఆయన హిందూపురాన్ని ఎంచుకుని టెక్కలిని వదిలేశారు. ముందు నుంచి టెక్కలి కాలింగ సామాజిక వర్గానికి పట్టున్న సీటుగా వస్తోంది. ఇక్కడ నుంచి దువ్వాడ నానావళి, హనుమంతు అప్పయ్య దొర లాంటి నేతలు విజయం సాధించారు. ఇక 2009లో టెక్కలిలో ఓడిపోయిన అచ్చెంన్నాయుడు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోను మరోసారి ఓడిపోయారు. అయితే 2014లో 8 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన అచ్చన్న 2019 లోను మ‌ళ్లీ 8 వేల ఓట్ల‌ మెజార్టీతో విజయం సాధించారు.

2014లో అచ్చన్న గెలిచాక నియోజకవర్గంలో మంత్రిగా ఉండడంతో అభివృద్ధి పనులు గట్టిగా జరిగాయి.
మారుమూల గ్రామీణ వాతావరణంతో ఉండే టెక్కలిలో చాలా చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా చెప్పాలంటే టెక్కలి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి మంత్రిగా అచ్చెన్న చేసి చూపించారు. అందుకే ఆయన గత ఎన్నికల్లో గెలవడానికి అది కారణమైంది. వచ్చే ఎన్నికలు అచ్చెన్న‌కు అంత సులువు కాదని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. సీఎం జగన్ సైతం వచ్చే ఎన్నికల్లో అచ్చెన్న‌ను ఎలాగైనా ఓడించాలని కసితో రగిలిపోతున్నారు.

ఇందుకు రకరకాల ఈక్వేషన్లు అమలు చేస్తున్నారు. 2014లో అచ్చన్నపై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌కు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అచ్చెన్న‌పై ఆయనే పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. అలాగే 2019 ఎన్నికల్లో అచ్చెన్న‌పై పేరాడ తిలక్ ఓడిపోతే.. దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. టెక్కలి నుంచి తిలక్ ఎమ్మెల్యే సీటుతో పాటు.. అటు అదే టెక్కలి నియోజకవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌కు ఎంపీ సీటు ఇచ్చినా టెక్కలిలో మాత్రం టిడిపి గెలిచింది.

ప్రస్తుతం దువ్వాడకు ఎమ్మెల్సీ ఇచ్చారు. పేరడ తిలక్ కాళింగ‌ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కి రాజ్యసభ ఇచ్చే అవకాశాలపై పరిశీలన కూడా జరుగుతుంది. కేవ‌లం అచ్చెన్న టార్గెట్‌గానే జగన్ ఇక్కడ ఉన్న నేతలు అందరికీ ఏదో ఒక పదవి కట్టబెట్టి అచ్చెన్న‌ను ఓడించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ? ఉందా అంటే అది శూన్యం అని చెప్పాలి.

అసలు అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రకరకాల ఈక్వేషన్లు.. కాలిక్యులేషన్లతో… కుల సమీకరణలతో అచ్చెం నాయుడుని ఓడించాలంటే అది జరిగే పని కాదు. కాళింగ‌లు అందరూ ఏకతాటి మీదకు వచ్చేసి దువ్వాడను గెలిపిస్తారను కోవటం భ్రమలుగా కనిపిస్తోంది. అదే జరిగితే 2014, 2019 ఎన్నికల్లోను అచ్చెన్న ఓడిపోవలసి ఉంటుంది. వాస్తవంగా కాళింగల్లో కూడా అనేక వర్గాలు ఉన్నాయి. వారిలో చాలామంది దువ్వాడకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక నియోజకవర్గంలో వెలమలతో పాటు తూర్పుకాపులు … మత్స్యకారులు కూడా ఉన్నారు.

అన్నీ ప‌ద‌వులు నియోజ‌క‌వ‌ర్గంలో కాళింగుల‌కే ఇవ్వ‌డంతో ఈ వ‌ర్గాల్లోనూ అసంతృప్తి ఉంది. ఇక
నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది అంటే వైసిపి నేతలు ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. కేవలం టేబుల్ పై పేపర్ మీద లెక్కలు వేసుకుంటూ గెలుస్తామన్న ఊహల్లో మునిగితేలుతున్నారు. మరి ఈ కాకి లెక్కలు అచ్చెన్న‌ను ఓడిస్తాయ‌నుకుని వైసీపీ నేత‌లు క‌ల‌లు క‌న‌డంలో త‌ప్పేం లేదు.

Tags: ap politics, political updates, politics, polititions, social media, trending news, viral news, ysrcp