ముసుగు వీడింది… ‘ మ‌ద్దిపాటే ‘ క్యాండెట్‌.. వెంక‌ట్రాజు కోస‌మే వ‌చ్చా

ఎట్టకేలకు ముసుగు వీడింది.. మబ్బు తొలగింది. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో ఎప్పుడో స్పష్టత వచ్చినా పార్టీలో కొన్ని వర్గాలు.. కొందరు నేతలు ఇంకా కొందరు కేడర్‌ను మబ్బుల్లో ముంచి తేల్చితూ వస్తున్నారు. అధిష్టానం ఇన్చార్జిను మారుస్తుందని రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. దీనికి ఎట్టకేలకు చంద్రబాబు దేవరపల్లి సభ సాక్షిగా మరోసారి క్లారిటీ వచ్చింది. ప్రస్తుత ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజుకు అందరూ సహకరించి గెలిపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు నేతలతో పాటు వారి అనుచరగ‌ణంలో ఉన్న అనుమానాలకు చెక్‌ పడినట్లు అయింది.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రోగ్రాం కమిటీ ఇన్చార్జిగా ఉన్న మద్దిపాటి వెంకటరాజు యేడాదిన్నర క్రితం గోపాలపురం టిడిపి ఇన్చార్జిగా వచ్చారు. ఆయన ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి నియోజకవర్గంలో తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పార్టీ నాయకులు.. కేడర్లో 90 శాతం మంది వెంకట్రాజుకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలతో పాటు వారి అనుచరులు మాత్రమే వెంకటరాజుతో క‌లిసి ప‌ని చేయ‌ట్లేదు.

ఇక ఆ ముగ్గురు, న‌లుగురు నాయ‌కుల అనుచ‌రులు తాజాగా చంద్రబాబు దేవరపల్లి సభలో వెంకటరాజు ప్రస్తావనే తీసుకురారు.. అక్టోబర్లో ఇన్చార్జి మారిపోతున్నారు అంటూ గత నాలుగు ఐదు రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు దేవరపల్లి సభలో చేసిన వ్యాఖ్యలు వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేశాయి. చంద్రబాబు తాను ప్రత్యేకంగా వెంకటరాజు కోసమే వచ్చాను అని యువకుడు, ఉత్సాహవంతుడు అయిన వెంకట్ రాజు ఇన్చార్జ్.. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మరోసారి స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో నియోజకవర్గ టిడిపిలో అతి స్వల్ప నాయకులు నేతల మధ్య ఉన్న ఆ దింపుడు కళ్లెం ఆశల‌కు ఇక తెర‌ప‌డిన‌ట్ల‌య్యింది.

ఇక వెంక‌ట‌రాజే ఇన్‌చార్జ్‌… ఆయ‌న్నే గెలిపించాలి.. ఆయ‌న కోస‌మే వ‌చ్చాన‌ని అన‌డం… అలాగే గ‌తంలో దొండ‌పూడి స‌భ‌లో.. ఇప్పుడు దేవ‌ర‌ప‌ల్లి స‌భ‌లో మ‌రోసారి క్లారిటీ ఇవ్వ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కేడ‌ర్ అంతా వ‌న్‌సైడ్ అయిపోయిన‌ట్ల‌య్యింది. ఇప్ప‌టికే అన్నీ స‌ర్వేలు వెంక‌ట‌రాజు గెలుపు స్ప‌ష్టం చేస్తుండ‌గా… తాజా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు టోట‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కేడ‌ర్‌లో మ‌రింత జోష్ నింపిన‌ట్ల‌య్యింది.