మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌

ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు మ‌ణిశ‌ర్మ మార్మోగియింది. ఆయ‌న స్వ‌ర‌ప‌రిచిన గీతాలు హోరెత్తేవి. టాలివుడ్ అగ్ర‌హీరోలు న‌టించిన ఏ చిత్ర‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఆయ‌నే ఉండాల్సిన రోజులు ఉన్నాయి. ప‌దేళ్ల కాలంలోనే సుమారు 110 చిత్రాల‌కు పైగా సంగీతం అంద‌జేశారు. మెలోడీ బ్ర‌హ్మ‌గా పేరు గ‌డించాడు. చిత్ర‌సీమ‌లోకి దేవీశ్రీ‌ప్ర‌సాద్‌, త‌మ‌న్‌, అనూప్ రూబెన్స్ త‌దిత‌ర న‌వ‌త‌రం మ్యూజిక్ డైరెక్ట‌ర్ల ఎంట్రీతో ఆయ‌న కాస్తా తెర మ‌రుగయ్యారు. మ‌ణిశ‌ర్మ జోరు కాస్తా త‌గ్గిపోయింది. రెండేళ్ల కింద‌ జెంటిల్ మ‌న్ సినిమాతో గ‌ర్జించిన మ‌ణి.. ఆ త‌ర్వాత ఆ జోరు చూపించ‌లేక‌పోయాడు. స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న సినిమాల‌తో కాలం వెల్ల‌దీస్తున్నాడు.

ఇదిలా ఉండ‌గా 2017లో అమీతుమీ, ఫ్యాష‌న్ డిజైన‌ర్, శ‌మంత‌క‌మ‌ణి, లై, 2018లో దేవదాస్ లాంటి సినిమాల‌తో కాస్తా వేగం పెంచిన మ‌ణి 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూ్ర్తిగా జోరు పెంచాడు. రేసులోకి వ‌చ్చాడు. స్టార్ హీరోల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం రామ్ రెడ్.. వెంకటేష్ అసురన్ రీమేక్ నార‌ప్ప‌.. చిరంజీవి, కొరటాల శివ సినిమాలతో పాటు ఇప్పుడు మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాకు కూడా కమిట్ అయ్యాడు మణిశర్మ ఒక‌ప్ప‌ట్లా కేవ‌లం సంగీతం మాత్ర‌మే చేస్తాన‌ని కాకుండా.. కొన్ని సినిమాల‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మ‌ణి ఇస్తుండ‌డం విశేషం.

Tags: ismart shanker, music director manisharma, narappa