హైదరాబాద్‌లో అన్ని ల‌క్ష‌ల‌తో ఇల్లు కొన్న మృణాల్‌… దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చింది…!

మృణాల్ ఠాగూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మృణాల్.. హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె పాత్ర‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Sita Ramam': Dulquer Salmaan, Rashmika Mandanna & Mrunal Thakur's Romantic  Saga Set To Hit The Big Screens On August 5th

ట్రెడిషనల్ బ్యూటిగా ఈ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మృణాల్ వ‌రుసగా అవకాశాలను అందుకుంటుంది. ఈ క్రమంలో ఆమె హైదరాబాదులో ఇల్లు కొన్న‌ద‌ని… ఆ ఇంటి విలువ దాదాపు 50 లక్షలు విలువ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన‌ మృణాల్ అడ్రస్ చెప్తే నేను కూడా వచ్చి మా ఇంటిని చూస్తాను.. అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది.

అయినా హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఎవరికి మాత్రం సెటిల్ అవ్వాలని ఉండదు అంటూ తెలిపింది. ఈ ఫన్నీ కామెంట్‌తో హైద‌రాబాద్‌లో మృణాల్ ఎటువంటి ఇల్లు కొనలేదని క్లారిటీ ఇచ్చేసింది. కాగా మృణాల్ కి ఎప్పటికైనా హైదరాబాదులో ఇల్లు తీసుకొని సెటిల్ అవ్వాలని ఉందన్న కోరిక బ‌లంగా ఉంద‌ని ఆమె మాట‌లే చెప్పేస్తున్నాయి.

Sita Ramam (2022) | Cast & Crew, Release Date, Images, OTT

ప్రస్తుతం మృణాల్.. నాని 30వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ పై వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న వీటి 12 సినిమాలోనూ ఆమె హీరోయిన్‌. ఇక టాలీవుడ్‌లో ఛాన్సుల కోసం మృణాల్ అందాలు ఆర‌బోసే విష‌యంలో గేట్లు ఎత్తేస్తోన్న ప‌ర‌స్థితి క‌నిపిస్తోంది.