ర‌ష్మిక ప్రేమ‌కు ఫుల్‌స్టాప్‌… ఆ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌…!

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో యూత్‌లో తిరుగులేని పాపులారిటీతో దూసుకుపోతున్నాడు. సినిమాలు ప్లాప్ అవుతున్నా కూడా విజ‌య్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే లైగ‌ర్ సినిమా ప్లాప్ అయినా విజ‌య్‌కు పాన్ ఇండియా లెవ‌ల్లో యూత్‌లో తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. విజ‌య్ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోగా పాపుల‌ర్ అయ్యాడు.

Rashmika Mandanna And Vijay Devarakonda HD Wallpapers - Wallpaper Cave

చాలా త‌క్కువ టైంలో సూప‌ర్ హిట్ సినిమాలతో విజ‌య్ స్టార్ పొజిష‌న్‌కు వ‌చ్చేశాడు. క‌ట్ చేస్తే విజ‌య్ గ‌తేడాది న‌టించిన లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు స‌మంత‌తో జోడీ క‌ట్టి ఖుషి సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. విజ‌య్ గుడ్ ల‌క్ ఏంటంటే తాజాగా వ‌చ్చిన అన్నీ మంచిశ‌కున‌ములే సినిమాలో విజ‌య్‌ను ముందుగా హీరోగా అనుకున్నారు.

అయితే విజ‌య్ క‌థ న‌చ్చ‌క రిజెక్ట్ చేశాడు. ఒక‌వేళ విజ‌య్ ఈ సినిమా చేసి ఉంటే మ‌రో ప్లాప్ త‌న ఖాతాలో ప‌డి ఉండేది. ఇదిలా ఉంటే విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక‌తో ఇప్పుడు కాస్త దూరంగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారంటూ ఒక్క‌టే పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ పుకార్లు గ‌త కొంత కాలంగా సైలెంట్ అయ్యాయి.

Liger Movie: Rowdyboy Journey With Vijay Devarakonda And Ananya Pandey In  Local Train

అయితే ఇప్పుడు విజ‌య్ ఓ బాలీవుడ్ భామ‌తో ఎక్కువ చ‌నువుగా ఉండ‌డంతో పాటు ఆమెతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్టు నేష‌న‌ల్ మీడియా కోడై కూస్తోంది. ఆమె సాన్నిహిత్యం ప్రేమ‌నా ? అన్న డౌట్లు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఆ హీరోయిన్ పేరు బ‌య‌ట పెట్ట‌లేదు కానీ.. ఆమె ఓ యంగ్ హీరోయిన్ అని తెలుస్తోంది. విజ‌య్‌కు బాలీవుడ్‌లో అన‌న్య పాండేతో పాటు మ‌రో ఒక‌రిద్ద‌రు హీరోయిన్ల‌తో మాంచి సాన్నిహిత్యం ఉంది. కొద్ది రోజుల్లోనే విజ‌య్ కొత్త ప్రేమ‌, డేటింగ్‌పై క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ అయితే ఉంది.