చరణ్ కూతురుని చూడడానికి ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?

ఇటీవ‌ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనలకు క్లిన్ కార‌ పుట్టింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్యన ఉండే ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో అందరికీ తెలుసు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ లానే కాకుండా సొంత బ్రదర్స్‌లా కూడా కనిపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇద్దరూ కలిసి కెమెరాల చిక్కుతూ ఉంటారు. ఇటీవల చరణ్ ఎన్టీఆర్ కలిసిన దాఖలాలు కనిపించలేదు.

చరణ్‌కి కూతురు పుట్టి నెల దాటుతున్న సరే ఇంకా తారక్ ఆ పాపను చూడడానికి వెళ్లకపోవడంతో ఫాన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి. తారక్ క్లిన్ కార‌ని చూడడానికి వెళ్లకపోవడానికి ఒక మంచి కారణం ఉందట. చిన్న పిల్లలకు త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏదైనా బాగోలేకపోతే వాళ్లతో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తారక్ బయట సినిమా షూటింగ్లో చాలామందిని కలుస్తూ ఉంటాడు.

ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ త్వరగా స్ప్రెడ్ అవుతాయి. చిన్న పిల్లలకు ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. అనే ఆలోచనతో ఎన్టీఆర్ ఇప్పటివరకు చరణ్ పాపను చూడడానికి వెళ్లలేదట. అంతేకాదు మెగా ఫ్యామిలీ కూడా బయట వారిని ఎవరిని ఇంట్లోకి ఆలో చేయడం లేదట‌. కేవలం కుటుంబ సభ్యులు తప్పిస్తే మెగా మనవరాలు క్లిన్ కార‌ రూంలోకి ఎవరు వెళ్లే ఛాన్స్ లేదట.