అర్జున్ క‌పూర్‌తో విడిపోయిన మలైకా… ఒక్క పోస్టుతో అత‌డితో బంధం తెంచేసిందిగా…!

బాలీవుడ్ జోడి అర్జున్ కపూర్- మలైక‌ అరోరా ప్రేమాయణం ముగిసిందా.. ఇద్దరి మధ్య కలతలతో దారులు దూరం పెరిగిందా ఈ జంట వివాహ బంధం వరకు చేరే అవకాశం లేదా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట మధ్య దూరం మొదలై చిన్నచిన్న కలతలు పెరిగి పెద్దవి అయ్యాయని కొన్నాళ్లుగా మలైకాకు దూరంగా ఉంటున్న అర్జున్ కపూర్ ఖాతాలో కొత్త గార్ల్‌ ఫ్రెండ్ చేరినట్టు తెలుస్తోంది. అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కుషా కపిలా డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మలైక శనివారం ఉదయం తన సోష‌ల్ మీడియ‌ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. బలంగా ఉండండి.. నిర్భయంగా ఉండండి.. అందంగా ఉండండి మీకు మద్దతిచ్చే సరైన వ్యక్తులు పక్కన ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.. నమ్మండి అని రాసుకుంది. ఇలా మలైకా వరుస పోస్టులు అర్జున్ కపూర్ కొత్త ప్రేయసి ఈ విషయంలో కపూర్ బాయ్ కూడా సైలెంట్ గా ఉండటం వంటి సంకేతాలు మలైకాకి దూరం అయినట్టుగా భావించాల్సి వస్తోంది.

వీటన్నిటి కంటే ముందు మలైక, అర్జున్ కపూర్ సిస్టర్స్ ఖుషి, జాన్వీకపూర్ లను సోషల్ మీడియా ఖాతాల్లో అన్ ఫాలో చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి మలైకాకి పడటం లేదా అని బాలీవుడ్ మీడియా సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా మలైకా- అర్జున్ కపూర్ బంధంపై ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వాడి- వేడిగా చర్చ సాగుతుంది. ఇద్దరూ ప్రేమలో పడినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారో తెలిసింది.

ఇద్దరి మధ్య 13 ఏళ్ల వయసు అంతరం ఉంది. ప్రేమకి వయసుతో తేడా లేదాని నిరూపించిన ఈ జంట వివాహ బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెడతారని చాలామంది భావించారు. ఇంతలోనే ఇప్పుడు షాక్ తగులుతోంది. ఇక అర్జున్ కపూర్ కొత్త ప్రేయసి కుషా కపిలా ఇటీవల తన భర్త జోరావర్ అహ్లువాలియా విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.