BiggBoss బిగ్ బాస్ 6 : ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఆ ఏడుగురు..?

BiggBoss సీజన్ 6 లో సోమవారం జరగాల్సిన నామినేషన్స్ ప్రాసెస్ బుధవారం జరిగింది. అయితే సోమ, మంగళ వారాల్లో క్లాస్, మాస్, ట్రాష్ అనే టాస్క్ ఇచ్చి ఒక ముగ్గురిని డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి.. ఒక ముగ్గురిని నామినేషన్స్ నుంచి సేఫ్ చేశారు. ఇక మిగిలిన వారి మధ్య బుధవారం నామినేషన్స్ జరిపారు. ఈ క్రమంలో జరిగిన నామినేషన్స్ లో మొత్తం 21 మందిలో ఏడుగురు కంటెస్టంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

ఎక్కువ ఓట్స్ సింగర్ రేవంత్ కి పడ్డాయి. దాదాపు అతనికి 8 ఓట్స్ దాకా పడ్డాయి. నామినేషన్స్ లో రేవంత్ తో పాటుగా చంటి, ఫైమా, శ్రీ సత్య, అభినయ శ్రీ, ఇనయా సుల్తాన్, ఆరోహి ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఈ వారం సేఫ్ అవుతారు. ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళ్తారన్నది చూడాలి. ఇక మొదటి నామినేషన్స్ లోనే హౌజ్ మెట్స్ మధ్య గొడవలు జరిగాయి.

BiggBoss ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో మాత్రం రేవంత్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సింగర్ గా సూపర్ క్రేజ్ ఉన్న అతన్ని టార్గెట్ చేస్తే తాము సేఫ్ అవ్వొచ్చు అన్న కారణంగానే కొందరు రేవంత్ ని కావాలని నామినేట్ చేశారని చెప్పొచ్చు.

Tags: BB6 First Week, BiggBoss, BiggBoss 6, BiggBoss Nominations, BiggBoss Telugu, nagarjuna, Star Maa