ఆ స్టార్ హీరోని ముసలోడంటూ మీరాజాస్మిన్ షాకింగ్ కామెంట్స్ …!

మీరా జాస్మిన్ ఓయబ్బో.. ఈరోజుల్లో అమ్మడు పేరు గ‌ట్టిగా వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటర్ అయిన ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా తక్కువ.. హిట్లు కొట్టింది మరీ తక్కువ.. కానీ బొద్దుగా ముద్దుగా క్యూటుగా తనదైన నటనతో జనాల మనసులను దోచింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన గుడుంబా శంకర్ సినిమా అమ్మడు కెరియర్ మారుస్తుంద‌నుకుంటే ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో మీరాజాస్మిన్ పెర్ఫార్మెన్స్ ఆమె అమాయకత్వం, చిలిపితనం అందరినీ ఆకట్టుకుంది .

Happy Birthday Meera Jasmine: 5 fashion lessons to learn from her Instagram  profile! | The Times of India

పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన మీరాజాస్మిన్ రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తోంది. అంతేకాదు ఈ క్రమంలోనే మొదట ఆమెకు విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందట. అయితే మీరాజాస్మిన్ .. వెంకటేష్ తో నటించన‌ని ఓపెన్ గా చెప్పేసిందట. ఆయన ఒకప్పుడు హీరో.. ఇప్పుడు కాదు ముసలోడు అయిపోయారు కదా అంటూ డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చిందట. దీంతో అప్ప‌ట్లో మీరా మాట‌లు ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

Venkatesh to take break from acting to follow spiritual path?

దీంతో వెంకటేష్ లాంటి పెద్ద హీరోని అంత మాట అంటుందా అంటూ జనాలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా చేయ‌గా… ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఈమెను అప్రోచ్ అవ్వగా..అది కూడా రిజెక్ట్ చేసిందట. ఇక మీరా జాస్మిన్ మంచి గ్లామర్ రోల్స్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్న‌ట్టు ఉంది. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో హీట్ ఎక్కిస్తోంది.