మళ్లీ పెళ్లి సినిమాలో ఆ రొమాంటిక్ సీన్లు చూసి సెన్సార్ మైండ్ బ్లాక్ … న‌రేష్‌, ప‌విత్ర రెచ్చిపోయారా ?

గత కొద్ది రోజులుగా ప్రముఖ సీనియర్ నటుడు వీకే నరేష్ , కన్నడ నటి పవిత్ర లోకేష్ ప్రేమాయణం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తన భర్త ప్రేమాయణం గురించి బహిర్గతం చేస్తూ నానా రచ్చ చేసింది. విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి ఎలా సిద్ధమయ్యాడు అంటూ ఆరోపించింది. మరోవైపు బెంగళూరులో నరేష్, పవిత్ర హోటల్లో ఉండగా అక్కడికి వెళ్లి మరి రమ్య రఘుపతి రచ్చ చేశారు. అంతేకాదు పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

VK Naresh announces marriage with Pavitra Lokesh - Telugu News - IndiaGlitz.com

ఇక ఇప్పుడు ఇదే క‌థ‌తో నరేష్ మరియు పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రల‌లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నరేష్ మరియు పవిత్ర లోకేష్ కలిసి చాలా రొమాంటిక్ గా ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ సినిమాపై భారీ స్థాయిలో హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా పలు ఇంటర్వ్యూలలో వారి బంధం, రిలేషన్, వారి పరిచయం గురించి కూడా పవిత్ర లోకేష్ ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పింది.

ఈ సినిమాలో చూపించే కథ మొత్తం కూడా నరేష్- పవిత్ర నిజ జీవితంలో జరిగిన సంఘటల‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో కాస్త హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ కాకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందట. దీంతో ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు గట్టిగానే ఉండబోతున్నాయని తెలుస్తుంది. పవిత్ర మరియు నరేష్ మధ్య ఆ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా లేక ఈ సినిమాలో వచ్చే మరో యువ జంట మధ్య ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.

Pavitra Lokesh Archives - JSWTV.TV

గతంలో అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీసిన ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న మళ్లీ పెళ్లి సినిమాకు క్లీన్ యూ గా ఉంటుంది అనుకోవడం పొరపాటే. కనుక చిన్న చిన్న రొమాంటిక్ షాట్స్ సినిమా లో ఉండడం చాలా కామన్ విషయం అంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి ఈ సినిమాలో ఎలాంటి హాట్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెడతారో చూడాలి.