రీసెంట్ టైమ్స్‌లో క‌థ న‌చ్చినా బాల‌య్య రిజెక్ట్ చేసిన టాప్‌-5 సూప‌ర్ హిట్లు ఇవే…!

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఎన్నో కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేయడానికి కారణం, ఆ సమయంలో ఆ కథ ఆ హీరోకు నచ్చకపోవడం… లేదా ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోవ‌డం… మరియు ఇతర కారణాలు కూడా ఉంటాయి. అయితే అలా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా కథను మరొక హీరోతో తెరకెక్కించిన సందర్భంలో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు అనేకం ఉంటాయి.

Narappa Movie Review - Venkatesh's Brilliance Generates Magic!

వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు . కాగా బాలయ్య కూడా తన కెరీర్ లో ఎన్నో హిట్‌ సినిమాలను మిస్ చేసుకున్నారట. కథ నచ్చిన కూడా కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నారట. అయితే రీసెంట్ కాలంలో బాలయ్య మిస్ చేసుకున్న ఐదు సూప‌ర్ హిట్‌ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bheemla Nayak (2022) - IMDb

అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్- వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 సినిమాలో ముందుగా వెంకటేష్ క్యారెక్టర్ లో బాలకృష్ణను అనుకున్నారట. ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో బాలయ్య ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన నారప్ప.. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్.. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ముందుగా బాలయ్యను హీరోగా అనుకున్నారట.

Godfather Box Office Day 2 (All Languages): Unlike Recent Chiranjeevi  Releases, This Political Drama Shows A Good Hold After Opening day

అదే సమయంలో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక.. కథ నచ్చిన కూడా బాలయ్య ఆ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా బాలయ్యని హీరోగా అనుకున్నారట. అదే సమయంలో బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉండడంతో డేట్లు అడ్జస్ట్ చేయలేక సినిమాకు నో చెప్పాడు. ఇలా బాలయ్య తనకు కథ నచ్చిన డేట్లు కుదరకపోవడంతో ఇలాంటి మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది.