పెళ్లికి ముందే మెగా డాటార్‌ నిహారిక అంత మందితో ప్రేమాయణం నడిపిందా..!

మెగా ఫ్యామిలీలో మరో జంట విడాకులకు సిద్ధమైందంటూ ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్నాయి. గ‌త‌ రెండు నెల‌ల నుంచి తెలుగు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు విడిపోయారని.. త్వరలోనే వీరిద్దరికి అధికారికంగా విడాకులు కూడా మంజూరు కాబోతున్నాయంటూ ఒకటే ప్రచారం జరుగుతుంది. కేవలం రెండేళ్ల క్రితమే వీరిద్దరూ పెళ్లి చేసుకుని మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.

Is Sai Dharam Tej marrying Niharika Konidela?

ఇది పూర్తిగా చిరంజీవి కుదిర్చిన వివాహం. చైతన్య తండ్రి పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. చిరుకు బెస్ట్ ఫ్రెండ్‌. వీళ్లకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. చిరంజీవి ఈ పెళ్లి కుదర్చ‌డంతో నిహారిక ఒక పెద్ద కుటుంబంలోకి కోడలుగా వెళ్లబోతుందని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందపడ్డారు. వీరి పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిందో లేదో వెంటనే ఈ వార్తలు రావడం మెగా అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

పెళ్లి తర్వాత నిహారిక తన భర్త కోరిక మేరకు నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేసి నిర్మాతగా మారింది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో ? ఈ విడాకుల వార్తలు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్గా నిహారిక రికార్డుల్లోకి ఎక్కింది. ఆమె స్టార్ స్టేటస్ అందుకోలేదు.. కానీ అడపాదడపా సినిమాలు చేసి మంచి నటి అనిపించుకుంది. ఇదిలా ఉంటే నిహారిక పెళ్లికి ముందే ఇద్దరు ముగ్గురితో ప్రేమలో పడిందన్న పుకార్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Naga Shourya opens up about his relationship and marriage with Niharika  Konidela

నిహారిక ముందుగా తన తొలి సినిమా హీరో నాగశౌర్యతో లవ్ ఎఫైర్ నడిపిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలో వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను నిహారిక పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. వార్త‌ల‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా పెద్ద షాక్ అయిపోయారు.

ఇక టాలీవుడ్ యంగ్ హీరో, తన బావ సాయిధరమ్ తేజ్ – నిహారిక మరి కూడా సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బావ, మరదలు ఇద్దరూ ఖండించారు. ఫైనల్ గా తన ఇంట్లో పెద్దలు కుదిర్చిన అబ్బాయి చైతన్యను పెళ్లాడింది. మరి చైతన్య – నిహారిక విడాకుల వార్తలు నిజమా లేదా ?పుకార్లేనా అన్నది వారిలో ఎవరో ఒకరు స్పందిస్తే గాని క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.

Police case against Niharika's husband Chaitanya - Telugu News -  IndiaGlitz.com