లగ్జరీ కార్లు తెగ కొనేస్తున్న భారతీయులు…. అసలు కారణం ఇద…!

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని కొంతమంది అంటుంటే…. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే ఆర్థిక శక్తి అవుతుందని మరి కొంతమంది అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి కొత్త అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారతదేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో భారత దేశంలో లగ్జరీ కార్లు సంస్కృతి మరింత పెరుగుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదని అంటున్నారు.

ఈ సందర్భంగా భారతీయులు చాలా ప్రోత్సాహమైన రేటుతో హాయ్ బడ్జెట్లో కార్లను కొనడానికి రీసెర్చ్ చేస్తున్నారు. లగ్జరీ కార్ల తయారీదారులు…. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి 2023 మొదటి అర్ధ భాగం (జనవరి, జూన్) లో రికార్డు స్థాయిలో అమ్మకాలు అయ్యాయి. ఇందులో భాగంగానే…. బెంజ్ 2023 మొత్తంలో 8,528 యూనిట్లను విక్రమించింది. గత ఏడాది కూడా ఈ రోజుల్లోనే విక్రయ యూనిట్ల కంటే 13% పెరుగుదల అని అంటున్నారు.

ఇదే క్రమంలో బిఎండబ్ల్యూ మొదటి అర్ధభాగంలో 5,867 యూనిట్లను విక్రమించింది. గత సంవత్సరం ఈ సమయంలోనే విక్రయించిన యూనిట్లు సంఖ్య‌తో పోలిస్తే ఈ సంవత్సరం 5% శాతం పెరిగింది. ఈ మొత్తం లెక్కింపులో 391 మినీ కార్ల విక్రయాలు కూడా ఉన్నాయి. ఇక ఆడి విషయానికి వస్తే… ఏడాది సగం లోని 3,473 విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.7% పెరుగుదల ఉంది. మొత్తం మీద ఈ ఏడాది సగం లోనే 20 వేలకు పైగా కార్లు రోడ్డు మీదకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 46,000,47,000 కి చేరవచ్చు.