Balakrishna : నందమూరి నట సింహం బాలయ్య బాబు ఆహా కోసం అన్ స్టాపబుల్ షోకి హోస్టింగ్ చేస్తున్నారు. అసలు బాలకృష్ణ యాంకర్ గా అన్న ఆలోచనే ఆడియన్స్ కి థ్రిల్ కలిగించింది. ఇక బాలయ్య బాబు సెన్సాఫ్ హ్యూమర్ టచ్ ఇచ్చి అన్ స్టాపబుల్ షోని రికార్డులకు అన్ స్టాపబుల్ అయ్యేలా చేశారు. రియాలిటీ షోస్ లో అన్ స్టాపబుల్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అది కొనసాగిస్తూ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి రెడీ అవుతున్నారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 సీజన్ 1 కన్నా ఇంకాస్త గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు సీజన్ 2 స్టార్ట్ అవుతున్న సందర్భంగా బాలయ్య అన్ స్టాపబుల్ కోసం ఒక స్పెషల్ యాంతం రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబందించిన ఎనౌన్స్ మెంట్ బయటకు వచ్చింది. బాలయ్య అన్ స్టాపబుల్ యాంతం రెడీ అవుతుంది. త్వరలోనే రిలీజ్ చేస్తామని ఆహా టీం ఎనౌన్స్ చేసింది.
సో బాలయ్య అన్ స్టాపబుల్ యాంతం తోనే రికార్డులు షురూ చేయనున్నాడని చెప్పొచ్చు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఎన్.టి.ఆర్, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్స్ గెస్టులుగా వస్తారని తెలుస్తుంది. అసలు నలుగురు హీరోలు ఒకేసారి కనిపిస్తే ఆ విజువల్ అదిరి అదిరి పోతుందని చెప్పొచ్చు. మరి ఆహా టీం అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఆ ఎపిసోడ్ రికార్డులు దబిడి దిబిడే అవుతుందని చెప్పొచ్చు.