మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. త్వరలో తెరంగేట్రం

తెలుగు సినీ పరిశ్రమలలో కొన్ని ఫ్యామిలీల నుంచి చాలా మంది హీరోలు వస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు ఉన్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్, రానా కాకుండా రానా తమ్ముడు అభిరామ్ కూడా ఇటీవల సినిమాల్లోకి వస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి అరడజను హీరోలు ఉన్నారు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీలో కూడా వారసులు అరడజనుకు పైగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, నరేష్, దివంగత రమేష్ బాబు, గల్లా అశోక్, సుధీర్ బాబు వంటి వారు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. తాజాగా ఈ ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరో తెరంగేట్రం చేయనున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తెలుగు సినిమాలలో కౌబాయ్‌గా, అల్లూరి సీతారామ రాజుగా, సింహాసనం సినిమా ద్వారా ఇలా వైవిధ్యమైన సినిమాలతో సూపర్ కృష్ణ వెండితెరపై చెరగని ముద్ర వేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. సినిమాలు, అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా రెండు చేతులా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ నుంచే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కూడా ఫీల్ గుడ్ మూవీలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. ఈ తరుణంలో ఈ ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ అనే యువకుడు సినిమాల్లోకి రానున్నాయి.

అతడు ఎవరో కాదు.. స్వయానా నరేష్ అల్లుడే. శశిధర్ ధావలి దర్శకత్వంలో ‘మిస్టర్ కింగ్’ అనే సినిమా రానుంది. ఈ సినిమాలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి వారు నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఉర్వి సింగ్, యశ్విక వెండితెరకు పరిచయం కానున్నారు. దీనికి సంగీత దర్శకుడిగా మణిశర్మ ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇటీవల పోస్టర్లు చూసిన వారు ఎవరో కొత్త హీరో అనుకుని ఊరుకున్నారు. తీరా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడని తెలియడంతో వారి ఫ్యామిలీ అభిమానులు స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Tags: entry, family, latest news, new hero, Super satr