Megastar : పూరీకి మెగా ఆఫర్.. ఆటో జానీ కాదు అంతకుమించిన కథతో..!

Megastar : మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి ప్రముఖ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తో స్పెషల్ చిట్ చాట్ చేశారు చిరంజీవి. ఈ ఆన్ లైన్ ఇంటర్వ్యూలో సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో పూరీ జగన్నాథ్ కూడా ఒక చిన్న పాత్ర చేశారు. యూట్యూబర్ గా పూరీ పాత్ర అలరించింది.

ఆ పాత్ర కోసం డైరక్టర్ మోహన్ రాజా ఎవరెవరినో అనుకోగా చిరు సలహా మేరకే పూరీ జగన్నాథ్ ని తీసుకున్నారట. ఫైనల్ గా సినిమా సక్సెస్ లో పూరీ కూడా భాగమయ్యాడని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే పూరీ, చిరు కాంబో సినిమా ప్రస్థావనకు వచ్చింది. ఆటో జానీ ఎంతవరకు వచ్చింది అని చిరంజీవి అడుగగా ఆటో జానీ కాదు సర్ అంతకుమించిన కథతో మీ దగ్గరకు వస్తా.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అని అన్నారు పూరీ జగన్నాథ్.

నువ్వు ఎప్పుడైనా వచ్చేయ్.. నేను రెడీ అంటూ మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే లైగర్ ఫ్లాప్ గురించి కూడా మాట్లాడిన చిరు ఆ ఓటమి నుంచి కసి పెంచుకుని మరింత ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు. పూరీ, చిరు ల కాంబో లో వచ్చిన స్పెషల్ చిట్ చాట్ ఆడియన్స్ ని అలరిస్తుంది.

 

Tags: godfather, Megastar Chiranjeevi, Mohan Raja, puri jagannath, Tollywood