Kajal Agarwal : కాజల్ కూడా కుమ్మేస్తుంది.. ఆ సినిమాలో అలాంటి రోల్..!

Kajal Agarwal : సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈమధ్యనే మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని చూస్తుంది. కాజల్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఒకటి రెండు ఆఫర్లు అమ్మడు చేజిక్కించుకుందని తెలుస్తుంది. అందులో ఒకటి చంద్రముఖి 2. లారెన్స్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని. చంద్రముఖి లో జ్యోతిక పాత్ర తరహాలో ఈ మూవీలో కాజల్ క్యారక్టర్ ఉంటుందని అంటున్నారు. సో ఈ సీక్వల్ లో టైటిల్ రోజ్ కాజల్ నటిస్తుందని చెప్పొచ్చు. కాజల్ కూడా రొటీన్ గా కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది.

ఆచార్య సినిమాలో తన పాత్ర కోసం కొన్ని రోజులు షూట్ చేసినా అది వర్క్ అవుట్ అవదని ఆమె పాత్రకి కట్ చేశారు. అయితే అది కాజల్ కి చెప్పే చేశారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు కాజల్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. అందుకే వచ్చిన ప్రతి ఛాన్స్ కి ఓకే చెబుతుంది. పెళ్లి తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటే ఆమె దారిలోనే కాజల్ కూడా అదరగొట్టేస్తుంది.

Tags: Chandramukhi 2, Kajal, Kajal Agarwal, Kollywood, Lawrence