ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ కి మొదటి ఛాయిస్ చిరంజీవినే.. ఆ చిన్న రీజన్ తో వదులుకున్నాడుగా..!?

ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ని రిజెక్ట్ చేశారా.. అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇండియన్ వెబ్ సిరీస్ లోనే టాప్ మోస్ట్ వెబ్ సిరీస్ గా రికార్డ్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో చిరంజీవి ఒకీలక పాత్రలో నటించాల్సి ఉంది.

నిజానికి ఈ వెబ్ సిరీస్ మేకర్స్ ముందుగా దీనినే సినిమా రూపంలో చేయాలని భావించరట. గతంలో ఇదే కథను తీసుకొని దర్శకులు రాజ్‌&డీకేలు నిర్మాత అశ్వినీధ‌త్‌ను కలిశారట. ఈ సినిమాలో చిరంజీవి నటిస్తే బాగుంటుంది అంటూ ఆ కథను తీసుకెళ్లి చిరుకు చెప్పారట. అయితే కథ విన్నా చిరంజీవి కథ బాగా నచ్చిన ఎంతో సున్నితంగా ఈ వెబ్ సిరీస్ ను రిజెక్ట్ చేశారట. ఆ సమయానికే ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లో ఉన్న చిరు.

ఇలా ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రిగా నటిస్తే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదని నో చెప్పారట. తర్వాత ఈ సినిమా కథనే వెబ్ సిరీస్ గా చేస్తే బాగుంటుంది అంటూ భావించి వెబ్ సిరీస్‌గా చేశార‌ట‌… ఇదే విషయాన్ని నిర్మాత అశ్వినీద‌త్‌ స్వయంగా చెప్పుకొచ్చారు. కాగా ఈ సిరీస్ లో నటించిన తరువాతే సమంత విడాకులు తీసుకుందంటూ అప్పట్లో పలు వార్తలు కూడా వచ్చాయి.