టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మొదలవుతున్న ఈ రియాల్టీ షో ఆదివారం సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈసారి హౌస్ లో రాబోతున్న కంటెస్టెంట్లు క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియాలో బిగ్‌బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కంటిస్టేంట్ంస్ వీరేనంటూ పలువురి పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. వీరిలో హాట్ మామ్ అండ్ డాటర్ జోడి సురేఖ వాణి సుప్రితా కూడా బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవబోతున్నారని న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఇక తాజాగా ఓ బాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు బిగ్‌బాస్‌కు రావడం లేదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సురేఖవాణి సుప్రితాల ఫ్యాన్స్ బిగ్ షాక్‌కి గురయ్యారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ వీడియోలతో, డాన్సులతో సందడి చేసే ఈ తల్లి కూతుళ్ళలో సురేఖ వాణి లేదా సుప్రిత ఇద్దరిలో ఎవరు వచ్చినా సందడి వేరే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ చివరి నిమిషంలో వీళ్ళు రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మొదట్లో వీరిద్దరికీ బిగ్ బాస్ నుంచి ఎటువంటి అవకాశం రాలేదని చెప్పినా తల్లి కూతుళ్లు బిగ్ బాస్ హౌస్ కి వస్తే ఎటువంటి నెగటివ్ టాక్ ఎదుర్కోవాల్సి వస్తుందా అనే ఆలోచనలో కూడా పడ్డారని సమాచారం. బిగ్‌బాస్ షోలో పాటిస్పేట్ చేసిన సెలబ్రిటీస్ ఎవరు నెగిటివ్ గానే తప్ప పాజిటివ్గా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. దీంతో సురేఖ వాణి, సుప్రీత ఇద్దరు వెనక్కు తగ్గరట. అయితే ఎప్పటిలాగే షో గ్రాండ్ లాంచ్ టైం కి కంటెస్టెంట్ల పేర్లను బయటకు రాకుండా గుట్టుగా ఉంచింది స్టార్ మా.