Godfather : మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. సల్మాన్ తో చిరు కేక పెట్టించారుగా..!

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్ (Godfather ). మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా ఆ టీజర్ లో చిరు, సల్మాన్ లుక్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ సాంగ్ లో కూడా కనిపించబోతున్నారు. గాడ్ ఫాదర్ నుంచి ఫస్ట్ సింగిల్ గా తార్ మార్ తక్కర్ మార్ అంటూ ప్రోమో రిలీజైంది.

చిరు, సల్మాన్ ఇద్దరు కాలు కదిపిన ఈ సాంగ్ క్రేజీగా ఉండబోతుంది. కచ్చితంగా థియేటర్ లో ఈ సాంగ్ కి మెగా ఫ్యాన్స్ దుమ్ముదులిపేలా చేస్తారని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. మళయాళ సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చి గాడ్ ఫాదర్ తెరకెక్కించారు.

ఇక ఈ Godfather సినిమాలో చిరు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అదిరిపోతుందని చెప్పొచ్చు. ఆచార్య ఫ్లాప్ తో డీలా పడ్డ మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది గాడ్ ఫాదర్. ముఖ్యంగా సల్మాన్ తో ఉన్న సీన్స్ అంటే ప్రేక్షకులకు ఓ మంచి ట్రీట్ అనిపిస్తుందని అంటున్నారు. అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందా లేదా చూడాలి.

 

 

Tags: Acharya, chiranjeevi, godfather, Godfather movie, Megastar Chiranjeevi, Mohan Raja, Salman Khan, Tollywood