రెజీనా షాకింగ్ కామెంట్స్.. అతడిని ప్రేమించా అంటూ..

రెజీనా.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే..సుధీర్ బాబు హీరోగా ‘ఎస్ఎంఎస్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనతికాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీకి పెద్ద హీరోలతో నటించే అవకాశాలు మాత్రం రాలేదు. చిన్న సినిమాలతో పాటు ఐటం సాంగ్స్ లోనూ మెరుస్తోంది.. ప్రస్తుతం రెజీనా ‘శాకిని డాకిని’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రెజీనాతో పాటు నివేధా థామస్ కూడా నటిస్తోంది.. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కి ఇది రీమేక్.. సెప్టెంబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు..ఈ సినిమా ప్రమోషన్స్ లో రెజీనా బిజీగా ఉంది..

ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రెజీనా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటి వరకు ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకోని ఈ బ్యూటీ తొలిసారి వాటిపై స్పందించింది. తన జీవితంలో ప్రేమ అనే అంశం 2020లోనే ముగిసిపోయిందని చెప్పింది. దాని నుంచి బయటపడేందుకు కొంచెం సమయం పట్టిందని, ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేని స్పష్టం చేసింది.

ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని, అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదని చెప్పింది. ఎదుటివారిపై ఆధారపకుండా సొంతంగా ఎలా జీవించాలో చిన్నతనం నుంచి తన తల్లి నేర్పిందని చెప్పకొచ్చింది. జీవితలో తోడు కావాలా.. వద్దా.. అనే విషయం గురించి ప్రస్తుతం ఆలోచించనని తేల్చి చెప్పింది. దీంతో రెజీనా ప్రేమించి మోసం చేసిన వ్యక్తి ఎవరని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. ఏదీ ఏమైనా రెజీనా తొలిసారి ఇలాంటి కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటిన రెజీనా భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

Tags: actress, latest, latest news, movies, Regina love