మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు ఎలాంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన సొంత టాలెంట్‌ను నమ్ముకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.. అందరి హీరోలు డ్యాన్స్ లు, ఫైట్లు చేస్తారు కానీ చిరంజీవి డాన్సులో అయినా ఫైట్స్ లో అయినా ప్రత్యేక మ్యానరిజం ఉండాలనుకున్నారు. మైఖేల్ జాక్సన్ వీడియోలు చూసి సొంతంగా డాన్స్ నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు తర్వాత అంతటి స్టార్ డంను అందుకున్నారు.
ఈ విధంగా తన తరం హీరోలతో పోటీపడి స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. ఎన్టీఆర్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మళ్ళీ అలాంటి నటుడు రాలేదు.. అదే సమయంలో చిరంజీవి ఒకే ఒక హిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. దర్శకులను తన వైపు తిప్పుకున్నారు. చిరు ఖైదీ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోగా మారిపోయాడు ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.
ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. చిరంజీవి కొండవీటి రాజా, కిరాతకుడు, విజేత వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న చిరంజీవి పై అప్పట్లో విష ప్రయోగం కూడా జరిగింది. ఇక నిజానికి చిరంజీవికి బయట ఫుడ్ తినాలంటే భయపడేవాడు షూటింగ్ సమయంలో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్లీ షూటింగ్‌కు బ్రేక్ వస్తుందని భావించేవారు. అయితే చిరంజీవి హీరోగా మద్రాస్ లో మరణ మృదంగం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ గ్యాప్ లో చాలామంది అభిమానులు గేటు వద్ద ఉండటంతో వారిని వెళ్లి కలిసిరు అప్పుడే ఓ అభిమాని చిరంజీవి కాళ్ళపై పడ్డాడు.
ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి చిరు ముందుకే కట్ చేశారు. అంతేకాకుండా ఆ కేక్‌ను తినాలని చిరును కోరాడు. కానీ చిరంజీవి షూటింగ్లో ఉన్నాను తినలేను అని చెప్పాడు. దాంతో అభిమాని కేక్ తీసుకుని చిరంజీవి నోటిలోపూశాడు. ఆ తోపులాటలో ఆ కేక్ కింద పడిపోయింది. ఇక ఆ కేక్ లో మెగాస్టార్‌కు రంగురంగుల పదార్థాలను గుర్తించాడు. వెంటనే ఆ కేక్ ను ఉమ్మేసి తన నోటిని కడుకున్నాడు. తర్వాత షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కానీ చిరంజీవి నాలుక బ్లూ కలర్ లో మారిపోయింది అది గమనించిన మేకప్ మాన్ వెంటనే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పారు.
దాంతో వెంటనే చిరంజీవిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు చిరంజీవికి విషానికి విరుగుడు మందులతో పాటు వాంతులు అయ్యే టాబ్లెట్లు ఇచ్చి విషాని తొలగించారు. ఈ విధంగా చిరు అప్పట్లో ఓ పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డాడు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వేరయ్య మూవీ ప్రమోషన్లలో బయటపడ్డాడు. అయితే మెగాస్టార్ అంటే గిట్టని వారే ఆయనపై విఫా ప్రయోగం చేసి ఉండవచ్చని గతంలో మురళీమోహన్ అనడంతో నిజంగా ఎవరైనా కావాలనే ఇలా చేశారా అన్న అనుమానాలు ఇప్పటికీ చిరు అభిమానుల్లో వస్తున్నాయి.