చిరును టెన్ష‌న్ పెడుతోన్న ‘ జైల‌ర్‌ ‘ లో ఆ పాయింట్‌…!

రజినీకాంత్ జైలర్ సినిమాతో ఆగస్టు 10న, చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో తమన్నానే హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం నుంచి రజినీకాంత్ సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం మానేశారు. దీంతో సూపర్ స్టార్ పోటీని మెగాస్టార్ కూడా లైట్ తీసుకున్నారు. ఇటీవల జైలర్ మూవీ ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సాధించడంతోపాటు ఆ సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి..

దీంతో చిరుకి కాస్త టెన్ష‌న్ స్టార్ట్ అయింది. రోబో తర్వాత సరైన హిట్ లేని రజినీకాంత్ క్రేజ్‌ టాలీవుడ్ లో పడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో రూ.50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మూవీస్ రూ.10 కోట్లు కలెక్షన్ రావడం కూడా కష్టంగా మారింది. ఇక మెగాస్టార్ వాల్తేరు వీర‌య్య‌ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

జైలర్ సినిమా హిట్ రజనీకాంత్ కు ఎంతగానో అవసరం. తెలుగులో తగ్గిన క్రేజ్ మళ్లీ దక్కించుకోవాలంటే జైలర్ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది. బీస్ట్ లాంటి ఫ్లాప్ సినిమా డైరెక్టర్ తో తెర‌కేక్కిస్తున్న సినిమా కావడంతో జైలర్‌పై మొదట్లో పెద్దగా హైప్‌ రాలేదు. కానీ ఇటీవల రిలీజైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. రజనీకాంత్ సినిమా లైట్ తీసుకున్న చిరంజీవికి జైలర్ ట్రైలర్ తో వచ్చిన రెస్పాన్స్ కాస్త టెన్షన్ పడుతుందని చెప్పాలి.

చాలాకాలం తర్వాత రజనీకాంత్ నుంచి మంచి ట్రైలర్ కట్ రావడంతో ఈ సినిమా కూడా రోబో రేంజ్ లో సక్సెస్ కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న విధంగానే రోబో సినిమా లాంటి సక్సెస్ రజినీకాంత్ దక్కించుకుంటే భోళా శంకర్ సినిమాకు దాని ప్రభావం తప్పదు. దీంతో మెగాస్టార్ లో కాస్త టెన్షన్ నెలకొందట.