‘మెగా 154’ ఓటీటీ డీల్ అన్ని కోట్లా.. మెగాస్టార్ అంటే అట్లంటది మరి!

‘ఆచార్య’ సినిమా ప్లాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. చిరు తన అభిమానులకు ఓ బ్లాక్‌బస్టర్ సినిమాని అందించాలని తెగ కుతూహల పడుతున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీతో కలిసి ‘మెగా 154’ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ డీల్ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ.50 కోట్లకు సేల్ అయ్యాయని ప్రస్తుతం సినీ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా 154 సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారని టాక్.

ప్రస్తుతం మెగా 154 సినిమా షూటింగ్ రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుంది. అసలు సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఓటీటీలో రూ.50 కోట్ల డీల్ కుదుర్చుకోవడం ఏంటి అని ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాని రూ.50 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ని కూడా రూ.57 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా దాని ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమాలపై పడే అవకాశం లేదనే అభిమానులు అంటున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గదని అంటున్నారు. అందుకు ఇప్పుడు జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు

మెగా 154 సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా రవితేజతో పాటు వెంకటేష్, నాగార్జున కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు. విక్రమ్ సినిమాలో హీరో కమలహాసన్‌తో పాటు మరో ముగ్గురు హీరోలు నటించారు. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలానే మెగా 154 సినిమాలో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలను గెస్ట్ రోల్స్ గా చూపించాలనేది బాబీ ప్లాన్. ఇక చిరు, నాగ్, వెంకీ, రవితేజ అందరూ ఒకే కనిపిస్తే సినీ ప్రేమికులకు కన్నుల పండగే ఇక.

మెగా 154 సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయితే 2023 సంక్రాతికి మెగా 154 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags: entertainment News, Mega 154 movie, Megastar Chiranjeevi, OTT Deal, Telugu Movie News