మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న చిత్రం మత్తు వదలరా.. ఈ సినిమా ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మత్తు వదలరా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీ సింహా, నరేష్ ఆగస్త్యా, ఆతుల్యా చంద్ర, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీలు నటిస్తున్నారు.
సినిమాను రితేష్ రానా దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం కాలా భైరవ అందిస్తున్నారు. నిర్మాతలుగా చిరంజీవి, హేమలత వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటుగా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ చూస్తే సినిమా ఓ ముగ్గురు స్నేహితులు తిండికి కూడా డబ్బులు లేకపోవడంతో నానా కష్టాలు పడటం, అనుకోకుండా వీరికి చాలా డబ్బులు రావడం.. అవి ఎలా వచ్చాయి.. ఎవరు సంపాదించారు.. వీరి ఎంచుకున్న మార్గం ఏమిటీ.. అనేది సినిమా కథగా ఎంచుకున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ కూడా సస్పెన్స్‌తో కట్ చేశారు దర్శకుడు. ఈ ట్రైలర్ నిడివి 1.53 నిమిషాలు ఉంది.