టాలీవుడ్ లో ఇద్దరు ఇద్దరే. ఒకరు మాటలతో మాయ చేస్తే.. ఒకరు అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఒక సినిమా విషయంలో మనస్పర్థలు వచ్చినట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ మాటల మాంత్రికుడికి.. అగ్ర నిర్మాతకు ఏ విషయంలో చెడింది.. ఎందుకు చెడింది.. ఈ మనస్పర్థలు సమిసి పోయాయా.. ఇవి ఎక్కడి వరకు దారి తీయబోతున్నాయి. అసలు ఈ విషయం అంత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం ఏమైన ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇంతకు ఈ మాటల మాంత్రికుడుతో మనస్పర్థలు వచ్చిన అగ్ర నిర్మాత ఎవ్వరు అనుకుంటున్నారా.. అయితే మీరు ఓసారి లుక్కేయండి. టాలీవుడ్‌లో మోస్ట్ పాపురల్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనుభవం ఆయన సొంతం. ఆయన ఏ సినిమానైనా అంచనా వేశాడా అంటే తప్పకుండా అయి తీరుతుంది. అందుకే అల్లు అరవింద్ ముందు సినిమా చూసి దాని ఫలితాన్ని అంచనా వేస్తాడు. సినిమా చూసి పలు సూచనలు కూడా చేస్తాడు.
అయితే ఇప్పుడు అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ నిర్మాత అల్లు అరవింద్ మద్య మనస్పర్థలకు కారణం అయింది. ఎన్నో సినిమాలకు రచయితగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అలా వైకుంఠపురములో సినిమా చేశాడు. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో సినిమా ఫస్ట్‌కాఫీని అల్లు అరవింద్, బన్నీ వాసులు వీక్షించారు. అయితే సినిమా మూడు గంటలకు పైగా నిడివి రావడంతో దీన్ని కొంత మేరకు తగ్గించాలని దర్శకుడు త్రివిక్రమ్‌కు సూచించాడని టాక్. అయితే అందుకు మనస్థాపం చెందిన త్రివిక్రమ్ చివరికి అల్లు అరవింద్ మాటకు తలొగ్గి సినిమాను రెండు గంటల నలబై నిమిషాలకు తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఇద్దరి నడుమ ఈ సినిమా మనస్పర్థలకు కారణమైందన్న మాట.