Malavika : చూపు తిప్పుకోనివ్వని మాస్టర్ బ్యూటీ..!

సౌత్ సినీ పరిశ్రమలో మళయాళ భామలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో మాళవిక మోహనన్ (Malavika ) కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. దళపతి విజయ్ మాస్టర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాళవిక తన సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా హంగామా చేస్తుంది. సీమాల సందడి ఎలా ఉన్నా అమ్మడి స్పెషల్ ఫోకస్ అంతా కూడా ఫోటో షూట్స్ మీద ఉంచింది.

అందుకే తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో వరుస ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మాళవిక మరోసారి రెచ్చిపోయింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పాల్గొనేందుకు ఈ లుక్ ని సిద్ధం చేసుకుంది. మాళవిక (Malavika ) గ్లామర్ షో చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోవడం గ్యారెంటీ.

కేవలం తెలుగు ఆడియెన్స్ కి డబ్బింగ్ సినిమాలతోనే పరిచయమైన మాళవిక డైరెక్ట్ తెలుగులో కూడా సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. ఆల్రెడీ స్టార్ సినిమా ఒకటి డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు టాక్. మాళవిక తెలుగు ఎంట్రీ ఇస్తే మాత్రం అమ్మడికి ఇక్కడ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం పక్కా అని చెప్పొచ్చు.

Tags: Filmfare, Malavika, Malavika Mohanan, Malavika Photoshoot, Malayalam, Master Heroine