బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ లేటెస్ట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకుంది. మిమి సినిమాకు గాను కృతి సనన్ (Krithi Sanon ) కి ఈ అవార్డ్ దక్కింది. బాలీవుడ్ లో కృతి సనన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పట్లో ఆమె మీద ఓ బాలీవుడ్ నటి హెడ్ లైట్స్ లేవు, బంపర్ కూడా లేదని కృతి సనన్ యద, వెనక భాగం గురించి పబ్లిక్ గా కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్స్ ని తట్టుకుని స్టార్ హీరోయిన్ గా నిలబడ్డది కృతి సనన్.
ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో హెడ్ లైట్స్ లేకపోవడం కాదు హెడ్ లైన్స్ లో నిలబడిందని ఆమెని పొగుడుతున్నారు. మోడల్ గా రాణించిన కృతి సనన్ (Krithi Sanon ) బాలీవుడ్ లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో 1 నేనొక్కడినే సినిమా చేసింది కృతి సన్నన్ ఆ తర్వాత నాగ చైతన్యతో దోచెయ్ సినిమా కూడా చేసింది. రెండు సినిమాలు నిరాశపరచడంతో టాలీవుడ్ ని లైట్ తీసుకుంది.
బాలీవుడ్ లో మాత్రం కృతి సనన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కూడా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న ఆమెని చూసి చాలామంది కొత్త హీరోయిన్స్ స్పూర్తి పొందుతున్నారు.