క‌రాటే క‌ళ్యాణికి మంచు విష్ణు షోకాజ్ నోటీసులు… మాలో కొత్త ర‌చ్చ‌..!

తెలుగు సినీ ప్రేక్షకులకు కరాటే కళ్యాణి గురించి తెలిసిందే. ప‌లు సినిమాల్లో కామెడీ రోల్స్ చేయ‌డంతో పాటు కొన్ని సీరియ‌ల్స్‌లోనూ ఆమె న‌టించారు. కొన్ని సీరియ‌ల్స్‌లో ఆమె విల‌న్ పాత్ర‌లు కూడా వేశారు. న‌ట‌న‌లో ఆమెను ఎవ్వ‌రూ త‌ప్పుప‌ట్ట‌లేరు. అయితే ఆమె చేసే సినిమాయేత కార్య‌క్ర‌మాల‌తో ఆమె వివాదాల్లో చిక్కుకుని వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు.

Khammam NTR statue, Karate Kalyani: ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేసే  ప‌రిస్థితి తెచ్చుకోకండి..క‌మ్మ‌, యాద‌వుల‌తో ఓటు బ్యాంకు రాజ‌కీయాలు - karate  kalyani sensational ...

కొద్ది రోజుల క్రితం ఓ వ్య‌క్తిని కొట్టి ఆమె వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఎన్టీఆర్ వందో జయంతి సందర్భంగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే క‌ల్యాణి ఆ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ను అడ్డుకుంటామంటూ చేస్తోన్న వ్యాఖ్య‌లు పెద్ద వివాదాస్ప‌దం అవుతున్నాయి. ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని ల‌క్కారం ట్యాంక్ బండ్ వ‌ద్ద 54 అడుగుల పొడ‌వైన శ్రీ కృష్ణుని రూపంలో ఉన్న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నారు.

రాజకీయ లబ్ధికోసమే ఇలా... ఎన్టీఆర్ అంటే కృష్ణుడే కనిపిస్తున్నాడా..? కరాటే  కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

మంత్రి పువ్వాడ అజ‌య్‌తో పాటు సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అవుతున్నారు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు కూడా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం అందింది. ఈనెల 28వ తారీకున ఎన్టీఆర్ యొక్క ఈ భారీ విగ్రహావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని యాద‌వ సంఘం పేరుతో అడ్డుకుంటాన‌ని క‌రాటే క‌ల్యాణి ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్! |  Hashtagu Telugu

యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిని అంటూ చెప్పుకునే కరాటే కళ్యాణి యొక్క వ్యాఖ్యలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా అధ్య‌క్షుడి హోదాలో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు అడ్డు త‌గిలేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న క‌ల్యాణికి షోకాజ్ నోటీసు ఇవ్వ‌డంతో పాటు విష్ణు స్పందించే ప్ర‌య‌త్నం కూడా చేసింది. అటు క‌రాటే క‌ల్యాణి కూడా దీనిపై మాట్లాడుతూ విష్ణు త‌న‌తో మాట్లాడిన విష‌యం నిజ‌మే అని చెప్పారు.

కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు.. వివాదం అవుతున్న నటి  వ్యాఖ్యలు..

అయితే తాను యాదవ హక్కుల పరిరక్ష కోసం పని చేస్తాన‌ని.. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంను తాము వ్యతిరేకిస్తున్నామ‌ని చెప్పింది. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.