ఆ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ వార్త‌లు.. కోపంతో సీనియ‌ర్ ఎన్టీఆర్ ఏం చేశారంటే…!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తిరుగులేని స్టార్ హీరో అయ్యారు అన్న‌ నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ – మహానటి సావిత్రి కాంబినేషన్లో పదులలో సినిమాల్లో నటించారు. అయితే ఎన్టీఆర్ జానపద, పౌరాణిక, సాంఘిక ప్రేమ కథ నేపథ్యం ఉన్న చాలా సినిమాలలో నటించారు. ఎన్టీఆర్ ఎవరిని పేరుతో పిలిచేవారు కాదు. అందరితో బంధుత్వం కలుపుకొని మాట్లాడేవారు.

N. T. Rama Rao filmography - Wikipedia

ఆయన వచ్చారంటే షూటింగ్ సెట్ లో అందరూ కామ్ గా ఉండేవారు.. కానీ ఆయన మాత్రం అందరితో చాలా సరదాగా ఉండేవారు. డిసిప్లైన్ కి మారుపేరుగా ఉండే ఎన్టీఆర్ ప్రతి ఒక్కరితో అంటే లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా గౌరవించేవారు. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అనే వ్య‌త్యాసం ఉండేది కాదు. అప్పట్లో ఒక స్టార్ హీరో.. హీరోయిన్ కొద్దిగా చనువుగా మాట్లాడుకున్నారు అంటే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు రాయడం మ‌ద్రాస్ మీడియాకు ఉత్సాహంగా ఉండేది.

NTR and Savitri | Old film stars, Indian film actress, Telugu cinema

అలానే ఎన్టీఆర్ – సావిత్రికి మధ్య కూడా ఏదో ఉందంటూ అనేక రకాల వార్తలు అప్ప‌టి మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ చాలా సార్లు మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేద‌ని చెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఈ పుకార్లు ఆగ‌లేదు. దీంతో కోపం వచ్చిన ఎన్టీఆర్ అప్పటికప్పుడు ఒక పెద్ద ఇంటిని కొని ఆ ఇంట్లో భార్యతో కలిసి గృహప్రవేశం చేశారు. సావిత్రిని ఇంటి ఆడపడుచు ప్లేస్ లో ఆహ్వానించి ఆమెతో పాలు పొంగించారు.

N.T.R And Savitri Super Hit Songs - Volga Videos 2018 - YouTube

అయితే ఈ గృహప్రవేశానికి వారి గురించి ఎఫైర్ రాసిన అన్ని మీడియాల వారిని పిలిచి భోజనాలు పెట్టార‌ట‌. త‌ర్వాత తన స్పీచ్ తో వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. సావిత్రి తనకు చెల్లి లాంటిదని సావిత్రి ఆయ‌న‌ ఇంటి గృహప్రవేశానికి పాలు పొంగించింది అంటూ చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వచ్చిన ఎఫైర్ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.