మంచు వారబ్బాయ్ మంచు మనోజ్ (Manchu Manoj) చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. తన స్నేహితులు ఏర్పాటు చేసిన వినాయక చవితి ఏర్పాట్లని చూసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చాడు మంచు మనోజ్. ఇక ఈ క్రమంలో అతన్ని కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటున్న మ్యారేజ్ మ్యాటర్ గురించి అడిగారు. కానీ మంచు మనోజ్ మాత్రం దానికి కొద్దిగా టైం ఉందని. ఇది కేవలం వినాయక చవితి గురించి మాత్రమే మాట్లాడతానని ఆ విషయాలను తర్వాత వెళ్లడిస్తానని అన్నారు.
Manchu Manoj రెండో పెళ్లికి సిద్ధమయ్యాడట. అతను భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమ మౌనికని పెళ్లి చేసుకోనున్నాడని తెలుస్తుంది. సీతాఫల్ మండిలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలను మౌనికతో కలిసి అటెండ్ అయ్యారు మంచు మనోజ్. మొదటి భార్య ప్రణతితో 2019లో మనోజ్ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు రెండో పెళ్లిగా భూమా మౌనికని పెళాడుతున్నట్టు తెలుస్తుంది.
అయితే మనోజ్ పెళ్లి.. రాజకీయ ప్రవేశం గురించి త్వరలో వెళ్లడిస్తానని అన్నారు. కాబోయే భార్యతో కలిసి మంచు మనోజ్ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు మనోజ్ సినీ కెరియర్ కి కూడా చాలా గ్యాప్ ఇచ్చాడు. హీరోగా మంచి టాలెంట్ ఉన్నా సరే ఎందుకో కెరియర్ లో బాగా వెనకపడ్డాడు మంచు మనోజ్. అయితే గ్యాప్ తీసుకున్న మంచి కంబ్యాక్ ఇస్తాడని మంచు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.