Poojitha Ponnada : ఆ హాట్ హీరోయిన్ తో దేవి శ్రీ ప్రసాద్ మ్యారేజ్..!

ఇండస్ట్రీలో బ్యాచిలర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరితో లింక్ పెట్టి వార్తలు రాయడం చాలా కామన్. ఇక వాళ్లిద్దరు కలిసి ఒకటి రెండు సార్లు కనిపిస్తే ఇక వారి మధ్య సంథింగ్ సంథింగ్ అని మీడియా ఫిక్స్ చేస్తుంది. లేటెస్ట్ గా రాక్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి ఓ హాట్ హీరోయిన్ తో పెళ్లంటూ వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి కానీ ఓ టాప్ మ్యూజిక్ డైరక్టర్.

ఆయనతో ప్రేమలో పడిన భామ ఎవరు అంటే పూజిత పొన్నాడ (Poojitha Ponnada). తెలుగు అమ్మాయే కానీ ఇంకా స్టార్ క్రేజ్ తెచ్చుకోని ఈ భామ చిన్న చిన్న సినిమాలతో అడ్జెస్ట్ అవుతుంది. అందం.. అభినయం రెండు ఉన్న ఈ అమ్మడికి సరైన ఛాన్సులు రావట్లేదని టాక్. ఊపిరి సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన పూజిత (Poojitha Ponnada) రంగస్థలం సినిమాలో ఆది లవర్ గా నటించింది.

ఇక అమ్మడితో దేవి శ్రీ ప్రసాద్ లవ్ ట్రాక్ నడిపించాడని టాక్. అంతేకాదు వీరిద్దరు కలిసి సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలని ఖండించింది పూజిత పొన్నాడ నేను నా పాటికి సినిమాలు చేస్తుంటే మీరు అలా ఎలా రాసేస్తారని అంటుంది. చిన్న సినిమాల్లో అయినా క్రేజ్ కోసం అమ్మడు లిప్ లాక్స్ గట్రా బాగానే కానిచ్చేస్తుంది. మరి పూజితకి ఎప్పుడు మంచి క్రేజ్ వస్తుందో చూడాలి.

Tags: Devi Sri Prasad, Heroine, Poojitha Ponnada, Pujitha, Pushpa, Rangasthalam, Rockstar, Tollywood