లవ్ మ్యారేజ్ కి సిద్ధమైన మాళవిక… ఈ జంట ఫొటోస్ వైరల్….!!

కభీ ఖుషి కభీ ఘమ్ లో పూజా పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి మాళవిక రాజ్. ఈ చిత్రం 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా మూడు ముళ్ళు బంధం లోకి అడుగుపెట్టనుంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గా తో వివాహానికి రెడీ అయిపోయింది. టర్కీలో ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి తమ విషయాన్ని తెలిపింది. ఇద్దరూ జంటగా దిగిన ఫోటోలను షేర్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది.

ఇంస్టాగ్రామ్ లో మాళవిక… మేము త్వరలోనే కొత్త ప్రపంచంలో అడుగుపెట్టబోతున్నాం…. చాలాకాలం తర్వాత మాకు సమయం వచ్చింది. ఈ బంధంతో మేము ఇంకా బలంగా తయారయ్యాం. అంటూ క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, స్నేహితులు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అవంతిక దస్సాని సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే మాళవిక, ప్రణవ్ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘ k3G ‘ అనే సినిమాలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను మాళవిక చేసింది. అంతే కాకుండా ఆమె 2017లో వచ్చిన సినిమా జయదేవ్ లో కూడా కనిపించింది. మాళవిక ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీష్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కూతురు. అంతేకాకుండా ప్రముఖ నటి అనిత రాజ్ మేనకోడలు కూడా.