మెగాస్టార్ ‘ భోళాశంక‌ర్ ‘ ర‌న్ టైం డీటైల్స్‌… క్రిస్పీగా క‌ట్ చేశారే…!

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. క్లీన్ U/A సర్టిఫికెట్ తెచ్చుకుని సెన్సార్ సభ్యుల నుంచి కూడా మంచి టాక్ అందుకుంది. ఇప్పటికే టీజర్, టైలర్, పాటలతో సినిమాపై అంచనాలు పెంచేశాడు మెగాస్టార్. అదే విధంగా ఈ సినిమాలో మరోసారి వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామని అర్థమవుతుంది.

ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. గతంలో కోలీవుడ్లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకి భోళా శంకర్ తెలుగులో రీమేక్ గా రూపొందింది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మించారు.

ఇక‌ ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో అఫీషియల్ రన్ టైం కూడా లాక్ అయినట్టు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భోళా శంకర్ మూవీ మొత్తం 160 నిమిషాలు అంటే రెండు గంటల 40 నిమిషాల పాటు ఈ మూవీ రన్ టైం ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాతో కూడా మరో వాల్తేరు వీర‌య్య‌ లాంటి బంపర్ హిట్ అందుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.