చిరంజీవినే కాదు బాల‌య్య కూడా ఖైదీ టైటిల్‌తో హిట్ కొట్టాడనే విష‌యం మీకు తెలుసా…!

మ‌న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఖైదీ సినిమా పేరు విన‌గానే అంద‌రికి ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరే గుర్తుకు వస్తుంది. చిరంజీవికి త‌న కేరీర్‌లో తిరుగులేని స్టార్‌గా వ‌చ్చి టాలీవుడ్‌కు మెగాస్టార్‌ను చేసిన సినిమా ఖైదీ. ఇక ఈ సినిమాను కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఒక్కసారిగా తెలుగు సినిమా గతిని మార్చింది.

ఎన్టీఆర్ అదే సమయంలో రాజకీయాల్లోకి వెళ్ళటం.. ఆయన స్థానాన్ని భర్తీ చేసే హీరో తెలుగులో ఎవరు.. అన్న స‌మ‌యంలో ఆయన స్థానాన్ని బర్తీ చేసే హీరో కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న సమయంలో చిరంజీవి ఖైదీ సినిమాతో ఒక్కసారిగా లైన్ లోకి వచ్చాడు. ఇక ఖైదీ సినిమా తర్వాత ఇదే పేరుతో చిరు ఖైదు నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించి భారీ విజయాలను అందుకున్నాడు. మన తెలుగు చిత్ర‌ పరిశ్రమలో ఖైదీ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి ఆ సినిమాలలో ఖైదీ రుద్రయ్య లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.

ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఖైదీ సినిమాతో చిరంజీవి మాత్రమే సూపర్ హిట్ కొట్టారని చాలామంది అనుకుంటారు.. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బాలకృష్ణ కూడా సేమ్ ఖైదీ లాంటి సినిమాతో తన కెరీర్లో మరో భారీ హిట్ అందుకున్నాడు ఆ సినిమా ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. బాలకృష్ణ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి.

నిజానికి కోడి రామకృష్ణ తర్వాత బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకులలో కోదండరామిరెడ్డి కూడా ముందు వరుసలో ఉంటారు. వీరి కాంబినేషన్ లో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో హిట్ సినిమాలు కూడా వచ్చాయి.. అలా వీరిద్దరి కాంబినేషన్లో 1989లో వచ్చిన సినిమా భలే దొంగ..దేవి ఫిలిమ్స్ పతాకంపై కె. దేవి వరప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. బాలయ్యకు జోడిగా విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు.చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ప్రస్తుత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఈ సినిమాకు రచయితగా పనిచేశారు. వి ఎస్ ఆర్ స్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలో బాలయ్య సురేంద్ర అనే దొంగగా నటించారు. మెయిన్ విలన్ గా చరణ్‌ రాజ్ కనిపించారు. అలాగే ఎస్పి ఇంద్రాణి పాత్రలో శారద నటించారు. తెలుగులో హిట్ అయిన ఈ సినిమాను ఖైదీ నెంబర్ 1 పేరుతో హిందీలోకి కూడా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా బాలయ్య కూడా ఖైదీ పేరుతో ఒక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.