గుంటూరు కారం పోస్ట‌ర్‌లో మ‌హేష్ వేసిన షర్ట్ రేటెంతో తెలుసా…!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం మూవీ పోస్టర్ సరికొత్త లుక్‌ నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ పోస్టర్లో ఊరమాస్‌ లుక్‌లో పంచ కట్టుతో స్టైలిష్ గా సిగరెట్ కాలుస్తూ మహేష్ బాబు కనిపించాడు. ఇప్పటికే గుంటూరు కారం ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు షర్ట్ మార్కెట్లో బాగా సేల్స్ అయింది.

మహేష్ బాబు వేసుకున్న షర్ట్ మేడ‌ల్‌ కావడంతో ఫాన్స్ కూడా ఆ షర్ట్ లను తెగ కొన్నారు. ఇక తాజాగా మారో షర్ట్ లో మహేష్ బాబు లుక్ నిన్న రిలీజ్ అయింది. ఇక ఈ పిక్ లో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో అనే విషయంపై సరదాగా గూగుల్ సెర్చ్ చేయగా కాస్ట్ చూసి నోరెళ్ళ పెట్టారు ఫ్యాన్స్‌. ఎందుకంటే ఆ పోస్టర్లు మహేష్ బాబు ధరించిన షర్ట్ అక్షరాల రూ.75 వేలు. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ ఆయన రేంజ్ కి ఈ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు మాత్రం కోటిలో అలాంటి షర్ట్స్‌ 70కి మూడు వస్తాయి అంటూ ఫ‌ని క‌మెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ ష‌ర్ట్‌ కాస్ట్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక గుంటూరు కారం సినిమా షూటింగ్స్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళితో పాన్ ఇండియా లెవెల్ మూవీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడని విషయం తెలిసిందే.