అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అర్హ చిలిపి చేష్టలతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. అంతేకాకుండా శాకుంతలం సినిమాలో భరతుడు పాత్రలో నటించి తన ముద్దు ముద్దు మాటలతో బాగా ఆకట్టుకుంది.
తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటూ ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. అందులో అర్హ , అయాన్ చెయ్యి పట్టుకుని స్కూల్ లోకి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఫోటోలో అల్లు వారసులు ఇద్దరు వెనుక నుంచి కనిపించారు. ఇద్దరి స్కూల్ బ్యాగ్స్ పై వారి వారి పేర్లు ఉన్నాయి. ఇక ఈ పిక్ చేసిన అల్లు అర్జున్ అభిమానులు భలే ముద్దుగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.