చిన్న వ‌య‌స్సులోనే రికార్డ్ బ్రేక్ చేసిన మ‌హేష్ కూతురు సితార‌… భారీ రెమ్యున‌రేష‌న్‌తో షేకింగ్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ హీరో కూతురుగా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల పోస్టులు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. తండ్రి మహేష్ బాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సితార క్రీయెట్‌ చేసుకుంది.

తరచూ తన డ్యాన్స్ వీడియోలు, అందమైన ఫోటోలు షేర్ చేస్తూ భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను సితార పెంచుకుంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.
అసలు విషయం ఏంటంటే, మహేష్ బాబు ఓ వైపు సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే..!

మ‌హేష్ ప్ర‌మోట్ చేసే బ్రాండ్స్ వేల్యూ ఎప్పుడూ పైపైనే ఉంటోంది. ఇక ఇప్పుడు తండ్రి బాటలోనే సితార కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా త‌న సత్తా చాటుకుంటోంది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్ గా సితారను నియమించుకుంది.

తాజాగా ఈ జ్యువెలరీ బ్రాండ్ తన ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ సితారతో నిర్వహించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సితార సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్‌ అందించినట్లు సమాచారం. చిన్న వ‌య‌స్సులోనే భారీ రెమ్యున‌రేష‌న్‌తో సితార ఇండ‌స్ట్రీలో షేకింగ్‌గా మారింది.