బాల‌య్య బ‌ర్త్ డే కానుక‌.. ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ రీ రిలీజ్‌… ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి. రీసెంట్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి సినిమా మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా రు. 3 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన‌ట్టు తెలుస్తోంది.

Lesser Known Facts About NBK & Singeetham Srinivas Rao's Classic Movie 'Bhairava  Dweepam' - Wirally

ఇప్పుడు మరో నందమూరి అగ్ర హీరో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో మెమొరబుల్ సినిమాను కూడా రీ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే రీ రిలీజ్ అయిన బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు బాల‌య్య కెరీర్‌లో మెమ‌ర‌బుల్ మూవీగా చెప్పుకునే జాన‌ప‌ద చిత్రం భైరవద్వీపం ఆయన జన్మదినం సందర్భంగా జూన్10న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టిలో తెర‌కెక్కిన‌ ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఇప్పుడు 4K లో రీరిలీజ్ కి సిద్ధం అవుతోంది. అంత‌కుముందు బాల‌య్య – సింగీతం కాంబినేష‌న్లో వ‌చ్చిన ఆదిత్య 369 సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో చంద‌మామా విజ‌యా కంబైన్స్ బ్యానర్లో భైర‌వ‌ద్వీపం తెర‌కెక్కింది. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఇష్టంగా చూస్తారు.

Amazon.com: Bhairava Dweepam : Nandamuri Balakrishna, Roja, Satyanarayana,  Vijayakumar, Vijaya Rangaraju, K. R. Vijaya, Subhalekha Sudhakar, Giri  Babu, Mikkilineni, Padmanabham, Rambha, Singeetam Srinivasa Rao, Singeetam  Srinivasa Rao, B. Venkatarami ...

మరి అలాంటి ఈ సినిమాను బిగ్ స్క్రీన్స్ పై చూడాల‌నుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ జాన‌ప‌ద సినిమాతో ఫ్యాన్స్‌కు పూన‌కాలు రావ‌డం ఖాయం. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది.