హిమాలయాలకు మహేశ్.. అందుకేనా..?

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు తర్వాతి సినిమాలపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ఇక ఇటీవ‌ల మ‌హేష్ బాబు హీరోగా.. అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ `సరిలేరు నీకెవ్వరు` సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దిల్‌ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు తొలి షో నుంచే బ్లాక్‌ బస్టర్ టాక్‌ వచ్చింది.

సినిమా రిలీజ్ ముందే హిట్‌ కొడుతున్నాం అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పిన చిత్రయూనిట్ మాట నిలబెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం త‌ర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉన్నా.. కథ అంతగా నచ్చకపోవడంతో సూపర్ స్టార్ ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మహేశ్‌కి చాలా కాలీ సమయం దొరికింది. దీంతో ఇప్పుటికే విదేశాలకు ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లివచ్చిన ఆయన త్వరలోనే హిమాలయాలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

స‌న్నిహితుల స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్‌ కొన్నిస్పా, థెరపీ సెషన్లకు హాజరవుతారని తెలుస్తోంది. మహేశ్ ఈ మధ్య ఆయుర్వేదంపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. చక్రసిద్ది నాడి వైద్యం గురించి ఆయన స్వయంగా ప్రమోట్ చేశారు కూడా. దీనిపై పాటు హిమాలయాలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించడం వల్ల మనిషికి కూడా స్వాంతన లభిస్తుంది. దీంతో మహేశ్ నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే సమయానికి మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్ అవ్వనున్న‌ట్టు తెలుస్తోంది.

Tags: Himalayas, MaheshBabu, Summer Vacations, Tollywood